గో ఎయిర్ భారీ ఆఫర్
న్యూఢిల్లీ: విమాయాన సంస్థల ఆఫర్ల వరద కురుస్తోంది. వరుసగా వర్షాకాల బొనాంజా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ విమానయాన సంస్థ గో ఎయిర్ రానున్న సీజన్ ను దృష్టిలో పెట్టుకుని బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. తక్కువ ధరకే విమాన టిక్కెట్లను ఆఫర్ చేసి విమాన ప్రయాణీకులను ఊరిస్తోంది. పరిమిత కాలానికి రూ.849 నుంచి ప్రారంభమయ్యే ధరలను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద జూన్ 29 నుంచి జూలై 2వ తేదీ మధ్యలో టికెట్స్ బుక్ చేసుకోవాలి.
ఇలా బుక్ చేసుకున్నవారు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 లోగా ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే ఈ స్కీం కింద బుక్ చేసుకున్న టికెట్లను రద్దుచేసుకునే అవకాశం లేదని గో ఎయిర్ వెల్లడించింది. దీంతోపాటుగ పేటీఎం ద్వారా ఈ చెల్లింపులు చేస్తే...10 శాతం క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేస్తోంది. అలాగే ప్రీ మీల్స్ బుకింగ్ కింద 60 శాతం తగ్గింపు, 200 రూపాయలు విలువచేసే కేఫ్ కాఫీడే వోచర్ ఆఫర్ ను కూడా అందిస్తోంది.