ఫ్లైటెక్ ఏవియేషన్ స్థల పరిశీలన
విజయపురి సౌత్: స్థానిక ఫ్లైటెక్ ఏవియేషన్ స్థలాన్ని ముంబాయి ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు సంజయ్ గోయల్, రక్షిత్ మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వం 2014 డిసెంబర్లో మినీఎయిర్పోర్ట్గా ఫ్లైటెక్ ఏవియేషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది, రన్‌వే పొడవు, వెడల్పును వీరు పరిశీలించారు. ప్రస్థుతం ఫ్లైటెక్ ఏవియేషన్‌కు ఉన్న 100 ఎకరాల స్థలం పక్కన ఉన్న ఫారెస్ట్, రెవెన్యూ, ప్రైవేట్ స్థలాలను మ్యాప్ ద్వారా పరిశీలించి, మాచర్ల తహసిల్దార్ వెంకటేశ్వర్లుతో మాట్లాడి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో సర్వేయర్ హర్షద్, మాచర్ల రూరల్ ఆర్ఐ ఏసీహెచ్ వెంకటేశ్వర్లు, మాచర్ల టౌన్ ఆర్ఐ శ్రీధర్, వీఆర్ఏ రవి తదితరులు పాల్గొన్నారు.