folk artists
-
గంగిరెద్దులకు క్యూఆర్ కోడ్.. నిర్మలా సీతారామన్ ఆసక్తికర వీడియో
ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. వివిధ రకాల బిల్లుల చెల్లింపులు మరింత సులభతరం అయ్యాయి. అంతా డిజిటల్ చెల్లింపులు అయిపోయాయి. ఇక భారత్‌లో డిజిటల్ పేమెంట్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతిచోటా నగదుకు బదులు ఫోన్లోని యాప్స్ ద్వారానే పే చేసేస్తున్నారు. ఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్ వరకు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ట్రాన్సక్షన్స్కే మొగ్గు చూపుతున్నారు. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఇది దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఎలా మార్పు తీసుకొచ్చిందనే దానికి అద్దం పడుతోంది. చదవండి: కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ పండుగ సమయంలో ఇంటింటికీ తిరిగే గంగిరెద్దులను ఆడించే వారు కూడా డిజిటల్ రూపంలో భిక్షాటన చేస్తున్న వీడియోను మంత్రి ట్విటర్లో షేర్ చేస్తూ.. డిజిటల్ విప్లవం జానపద కళాకారుల వైపుకు కూడా చేరుకుందని ఆమె తెలిపారు. 30 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో.. ఓ ఇంటి ముందుకు వచ్చిన గందిరెద్దుపై క్యూఆర్ కోడ్ ట్యగా్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేస్తాడు. ఈ వీడియోను పోస్టు చేస్తూ..‘గంగరెద్దలాటకు చెందిన వీడియో ఇది. డిజిటల్ చెల్లింపు విప్లవం జానపద కళాకారులకు చేరువైంది. ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో గంగిరెద్దులవాళ్లు సంక్రాంతి వంటి పండుగల సమయంలో ఎద్దులకు పలమాలలు వేసి ఇంటింటికి వెళ్లి నాదస్వారం వాయిస్తూ భిక్ష తీసుకుంటారు.’ అని పేర్కొన్నారు. Recd a video of a Gangireddulata, where alms are given thru a QR code! India’s #digitalpayment revolution, reaching folk artists. In AP + Telangana, Gangireddulavallu dress up old oxen no longer helpful on farms, walk door to door during fests, performing with their nadaswarams pic.twitter.com/8rgAsRBP5v — Nirmala Sitharaman (@nsitharaman) November 4, 2021 -
వాడుకుని వదిలేశారు ‘బాబూ’
తూర్పుగోదావరి,రాజమహేంద్రవరం కల్చరల్: ఆ కళాకారులు కాళ్లరిగిలా వాడవాడలా తిరిగి ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేశారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డి.విజయభాస్కర్ ఆదేశాల మేరకు 2018 ఆగస్టు నుంచి 2019 జనవరి వరకు 13 జిల్లాల్లో, ఆరు నెలలపాటు 74 దళాలు కాలికి బలపం కట్టుకుని గ్రామదర్శిని, నగర దర్శిని, జన్మభూమి ఇతర పథకాలపై జానపద కళారూపాలతో జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేశారు. జిల్లాకు కోటి రూపాయల చొప్పున నాటి ప్రభుత్వం కళాకారులకు రూ.13 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఒక్క రూపాయి విదల్చ లేదని, జిల్లా జానపద కళాకారుల సంక్షేమ సంఘం కో ఆర్డినేటర్, ప్రముఖ బుర్రకథ కళాకారుడు విభూతి బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆనం కళాకేంద్రంలో జానపద కళాకారులు బాబురావు ఆధ్వర్యంలో పలు రూపకాలను ప్రదర్శిస్తూ ఆవేదనను కళ్లకు కట్టేటట్టు ప్రదర్శించారు. మనసున్న ప్రజానేత సీఎం జగనన్న తమను ఆదుకుంటారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. -
నిజామాబాద్‌లో .. కళాకారుల ధూం ధాం
సాక్షి, నిజామాబాద్ కల్చరల్: ఎన్నికల వేళ పల్లెలు, పట్టణాల్లో జానపదాలు హోరెత్తుతున్నాయి. కళాకారుల ఆటపాటలు మార్మోగుతున్నాయి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... అంటూ కళాకారులు ఎన్నికల ప్రచారంతో దుమ్ము రేపుతున్నారు. ఆగట్టునుంటావ నాగన్న.. ఈ గట్టుకొస్తావా.. అంటూ ఓటర్లలో చైతన్యం కలిగించే పాటలు పాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కాళాకారులు కీలకంగా మారారు. నియోజక వర్గాల్లో 20 వరకు కళాబృందాలు ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున కాలికి గజ్జె కట్టి ఆడుతూ పాడుతున్నారు. నిజామాబాద్ అర్బన్‌తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్,డిచ్పల్లి, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కళాకారులను రంగంలోకి దించారు. తమ తరఫున విసృత ప్రచారం చేసేలా వారికి వాహనాలను సమకూర్చి పల్లెల్లోకి పంపించారు. దీంతో కళాకారులు గ్రామాలకు వెళ్తూ తమ ఆటపాటలతో ప్రజలను ఆకట్టుకొంటూనే, తమ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్ షోలతో పాటు బస్తీలు, కాలనీ కూడళ్లలో కళా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కళాకారులకు డిమాండ్ ఎన్నికల వేళ కళాకారులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. 5 నుంచి 10 మంది ఉండే బృందాలకు రోజు రూ.10 వేల నుంచి రూ.15 వేలు చెల్లిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే 15 రోజుల ముందు నుంచి వచ్చే నెల 5 వరకు ప్రచారం చేసేలా భారీ మొత్తంలో కళాకారులతో ఒప్పందాలు చేసుకుని, ప్రచారం చేయిస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి సుమారు 50 మంది కళాకారులు ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లు తెలుస్తోంది. మస్తు గిరాకీ.. ఎన్నికల పుణ్యమా అని అన్ని వర్గాల కళాకారులకు చేతినిండా పని లభిస్తోంది. ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న తరుణంలో డప్పు కళాకారులతో పాటు అడ్డాకూలీలకు, వంట మనుషులు, టెంట్ హౌస్ సామగ్రి, పూలు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, అద్దె వాహనాలు, ఫొటోగ్రాఫర్లు... ఇలా అందరూ ఉపాధి పొందుతున్నారు. ఇంతకుముందు శుభ, అశుభ కార్యక్రమాల సమయంలోనే డప్పు కళాకారులకు పని ఉండేది. కానీ, ఎన్నికల ప్రచారంలో వీరి అవసరం ఎక్కువగా ఉండటంతో కళాకారులతో పాటు పొరుగు జిల్లాల కళాకారులకు డిసెంబర్ 5వ తేదీ వరకు చేతినిండా పని దొరికింది. నేతలొస్తున్నారంటే పూలదండలతో స్వాగతం పలకాల్సిందే. దీంతో పూలదండలు తయారుచేసే వారి వ్యాపారం జోరందుకుంది. ఇక, అద్దె వాహనాలన్నీ ఆయా పార్టీల అభ్యర్థుల వద్దే ఉంటున్నాయి. కొందరు ముందస్తు గానే వాటిని బుక్ చేసుకున్నారు. డిమాండ్ తీవ్రంగా ఉండడంతో కొంత మంది అభ్యర్థులకు వాహనాలు పంపించడం కుదరడం లేదని ట్రావెల్ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఎన్నికల నిర్వహణ కోసం విధులు నిర్వహిస్తున్న అధికారులకు సైతం వాహనాలు అవసరం ఉండటంతో అద్దె వాహనాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. కార్యకర్తలు, ముఖ్య నేతల భోజనాలకు కొందరు సొంతంగా వంటలు తయారు చేస్తుండటంతో వంటసామగ్రితో పాటు వంటమనుషులకు పని దొరుకుతోంది. అలాగే సభలు, సమావేశాల సందర్భంగా టెంట్‌హౌస్‌లకు గిరాకీ పెరిగింది. ఫొటోగ్రాఫర్లకు, విడియోగ్రాఫర్లకు ఇన్నాళ్లు గిరాకీ కోసం ఎదురుచూడాల్సి ఉండగా, ఎన్నికల నేపథ్యంలో వారు కూడా బిజీగా మారారు. ఇవే కాకుండా ఫ్లెక్సీ, కరపత్రాల తయారీ కోసం గ్రాఫిక్ డిజైనర్లు, డీటీపీ ఆపరేటర్లు, ప్రింటర్లకు ఎన్నికల వేళ ఉపాధి అవకాశాలు రెట్టింపయ్యాయి. -
జానపద కళల్ని కాపాడుకుంటాం: రాజయ్య
ప్రపంచ జానపద దినోత్సవంలో డిప్యూటీ సీఎం రాజయ్య సాక్షి, హైదరాబాద్: జానపద కళాకారులను కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి రాజయ్య హామీ ఇచ్చారు. వారికి తప్పక ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక జానపద పాటలే పోషించాయని తెలిపారు. శుక్రవారం రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ, గిరిజన సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ జానపద దినోత్సవం-2014 కార్యక్రమం జరిగింది. నిజమైన సమాజిక కార్యకర్త కేసీఆర్ అని ఈ సందర్భంగా రాజయ్య కొనియాడారు. కళాకారులే తమ మాటలు, పాటల ద్వారా నేతలను తయారు చేశారన్నారు. ‘‘నేను ముందు తెలంగాణ వస్తుందనుకోలేదు. సదాలక్ష్మిలా చరిత్రలో అయినా నిలుస్తానని ఆశపడ్డాను. ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు రుణం తీర్చుకోలేనంత పదవినిచ్చారు’’ అన్నారు. జానపదం అద్భుత విజ్ఞాన గని అని గాయకుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. కళాకారుల బాగోగుల బా ధ్యతలన్నీ ప్రభుత్వమే తీసుకుంటుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. జానపదం తెలంగాణలో తిరిగి రాజ్యమేలుతుందన్నారు. జానపద కళారూపాలను బతికేలా చేయటానికే ప్రభుత్వం ఈ ప్రదర్శనలను నిర్వహిస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి తెలిపారు. -
దుప్పట్లకు కావాల్సిందే ఇక చప్పట్లు!
మన తెలుగువారు దేనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యం దానికి ఇవ్వరని ప్రతీతి. కాస్తంత స్థిమితంగా ఆలోచిస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే... దుప్పటికంటే చిన్న సైజులో ఉంటే శాలువాకు సన్మానాల సమయంలో ఎనలేని సభా గౌరవం ఉంది. ఆ మాటకొస్తే అంతకంటే చిన్నదైన ఎరుపురంగులో ఉండే కొత్త కండువా సైతం శుభకార్యాల్లో యజమాని భుజానికెక్కుతుంది. ఆఖరికి తుండుగుడ్డ కూడా సామాన్య రైతుల తలమీదికెక్కి తైతక్కలాడుతుంది. ఇక గొంగళి మాట చెప్పేదేముంది. అభ్యుదయ గేయకర్తలు, జానపద కళాకారులూ దానికి ఎనలేని ఖ్యాతి తెచ్చారు. విప్లవాన్ని కాంక్షించే ప్రజాకళాకారుడెవరైనా గొంగళి కప్పుకోవాల్సిందేనంటూ ఫత్వాలాంటి అప్రకటిత ఆదేశిక సూత్రాన్ని అలిఖిత రాజ్యాంగం ద్వారా ప్రకటించారు. ఆ డ్రెస్‌కోడ్‌ను కంపల్సరీ చేసేసి, గద్దరులాంటి వాగ్గేయకారులు దానికి ఎనలేని గ్లామరు తెచ్చారు. ఎంత ముతకగా ఉంటేనేం... అభ్యుదయానికి ఆటపట్టు గొంగళి. కానీ అటు శాలువా/తువ్వాళ్లకూ, ఇటు గొంగళికీ సెంటర్లో ఉండే దుప్పటి మాత్రం.... పాపం ఎటూగాకుండా అన్యాయమైపోయింది. కానీ దుప్పటిని ఒకసారి శ్రద్ధగా పరిశీలించండి. దాని గొప్పదనం తెలుస్తుంది. తెలుగు సినిమా రంగానికి ఇతోధికంగా సేవ చేసింది దుప్పటేనంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమాలో అనేక సింబాలిక్ సీన్లకు ప్రతీక దుప్పటి. ఓ క్యారెక్టర్ యాక్టరు భుజాల వరకు దుప్పటి కప్పుకుని దగ్గుతూ పడుకున్నాడు/పడుకున్నదంటే... సదరు ఆసామి జబ్బుమనిషి అని అర్థం. అక్కినేని లాంటి అగ్రశ్రేణి తారలంతా శాలువాను భుజాలకెక్కించుకున్నారు గానీ... సపోర్టింగ్ యాక్టర్లు ఎన్నిసార్లు కప్పుకున్నా పాపం... దుప్పటికి సరైన గౌరవం దక్కలేదు. ఇక ఆ జబ్బుమనిషి దగ్గరికి డాక్టర్ వచ్చి ‘‘అయామ్ సారీ!’’ అంటూ భుజాల వరకు ఉన్న దుప్పటిని తల మీదికి పాకించేశాడంటే... సదరు వ్యక్తి ఎలాంటి నటననూ ప్రదర్శించకపోయినా... దుప్పటే ఆ లోటును భర్తీ చేసి సన్నివేశాన్ని రక్తికట్టిస్తుంది. ఇలా దుప్పటి తెలుగు సినీ రంగానికి చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఇక సినీ గేయ రచయితలు సైతం ‘దుప్పట్లో దూరాక దూరమేముంది’ లాంటి అనేక గేయాలు రచించి దాని పట్ల తమ అభినివేశాన్ని చాటుకున్నారు. ఇంతటి ఖ్యాతి గడించిన దుప్పటి తరతరాలుగా మన తెలుగువారి నిర్లక్ష్యానికి లోనవుతూనే ఉంది. ఇక మన తెలుగువాళ్లు గుర్తించని దాన్ని పొరుగువాళ్లు గుర్తించి గౌరవించడం మామూలే కదా. చిన్నది కప్పుకునే ఓణీకి చున్నీ అని చిన్ని పేరు పెట్టుకుని... ఇది చాల్లే అని సరిపెట్టేశాం. కాని మన దక్షిణభారత దుప్పటి జ్ఞాపకార్థం వింధ్యకు ఆ వైపు ఉన్న ఉత్తర భారతదేశస్తులంతా మూకుమ్మడిగా తాము ఓణీలా ధరించే వస్త్రవిశేషానికి ‘దుపట్టా’ అని పేరు పెట్టి మనం నిత్యం కప్పుకునే దుప్పటిని వాళ్లు నిత్యం స్మరిస్తున్నారు. పొరుగువాళ్లు గుర్తించారు కాబట్టి ఇకనైనా దానికి సరైన గౌరవం దక్కుతుందేమో అని నేనంటే... నువ్వే కదా దాని టాలెంట్‌ను ‘తొక్కేస్తుంటావ్’ అన్నాడు మా ఫ్రెండు. అదెప్పుడ్రా అని నేను తెల్లబోతే... ‘రోజు రాత్రి పక్క మీద’ అంటూ దుప్పటి కప్పి చుట్టుముట్టి కొట్టిన ఫీలింగ్ తెచ్చేశాడు. - యాసీన్