హంపి ఉత్సవంలో నేటి కార్యక్రమాలు...
కృష్ణదేవరాయ వేదిక
సాయంత్రం 5 గంటలకు బళ్లారి అశ్వత్థ కళా బృందం నేతృత్వంలో నాడగీతే-రైతు గీతే, 6 గంటలకు బెంగళూరు ఎండీ పల్లవి కన్నడ పాటల గాత్రం, 7 గంటలకు సంప్రదాయక వస్త్ర ప్రదర్శన, రాత్రి 8 గంటలకు బెంగళూరు కస్తూరి శంకర్ సుగమ సంగీత కచేరి, రాత్రి 9 గంటలకు గజల్ బాంబై శబరి బ్రదర్స్ కవాలీ, రాత్రి 10 గంటలకు నృత్యం, రాత్రి 10.30 ముంబై షాన్ వారి హిందీ, కన్నడ పాటల గాయన కార్యక్రమం.
ఎంపీ ప్రకాష్ వేదిక
సాయంత్రం 6 గంటలకు బెంగళూరు ప్రవీణ్చే ప్యూజన్ బ్యాండ్ వాయిద్యం, 6.45 గంటలకు బెంగళూరు సయ్యద్ఖాన్ గజల్స్ కార్యక్రమం, 7.30 గంటలకు సాలబంజిక బెంగళూరు ఆర్థికో లేట్ ఇండియా ఆధ్వర్యంలో నృత్య రూపకం, రాత్రి 8.15 గంటలకు కలకత్తా రింపాశివ తబలా వాదన, 8.45 గంటలకు కలకత్తా ఆర్థికావెంకటేశ్ ఒడిస్సీ నృత్యం, 9.30 ముంబై సుభాముదగల్ హిందుస్థానీ సంగీత కచేరి, 10.30 గంటలకు బెంగళూరు డాక్టర్ కుమార్ పంచా వీణా వాదన, 11.15 గంటలకు బెంగళూరు ప్రసన్నగుడిచే హిందుస్థానీ సంగీత కచేరి.
విద్యారణ్య వేదిక
సాయంత్రం 6 గంటలకు బెంగళూరు ఆరాధన నృత్య పాఠశాల ఆధ్వర్యంలో సామూహిక నృత్యం, 6.30 గంటలకు బెంగళూరు గీతా ఎస్.హెల్బికర్చే సుగమ సంగీతం, 7 గంటలకు హొస్పేట కే.సన్నతిమ్మప్ప ఫ్లారియో నెట్ వాదన, 7.30 గంటలకు హొస్పేట శ్రీమాత మంజమ్మ యోగతిచే జోగతి నృత్యం, రాత్రి 8 గంటలకు హువినహడగలి కే.వనజాక్షి బృందం కన్నడ పాటలు, 8.30 గంటలకు బళ్లారి నాడోజ బెళగల్లు వీరణ్ణ బృందం తోలుబొమ్మల బాబ్, 9 గంటలకు బెంగళూరు రాఘవేంద్ర సంగీత సేవ ప్రతిష్టానంచే శ్రీరామ చరిత్ర నృత్య రూపకం, 9.30 గంటలకు హొస్పేట యల్లప్ప భండార్ బృందం జానపద గీతాలు, 10 గంటలకు దక్షిణి మంజునాథ్ నృత్య రూపకం, 11 గంటలకు హడగలి గోని బసప్ప జానపద గీతలు, 12 గంటలకు హువినహ డగలి రంగభారతి బృందంచే వార్డు నంబర్-6 నాటకం.
హక్కబుక్క వేదిక
మధ్యాహ్నం 3 గంటలకు ముగ్గుల, మెహందీ పోటీలు, 4 గంటలకు బళ్లారి వీణా కటకనహళ్లిచే హిందుస్థానీ గాయన, 4.30 గదగ్ మేఘా హుక్కేరిచే సుగమ సంగీత, 5 గంటలకు బెంగళూరు స్నేహలత బృందం కర్ణాటక సంగీతం, 5.15 గంటలకు గదగ్ భారతి డంబల బృందంచే మహిళా నాటకం, 5.30 గంటలకు హొస్పేట బీ.లక్ష్మిచే భరతనాట్యం, 5.45 గంటలకు బెంగళూరు గౌరి సంస్థాన బృందంచే మహిళా యక్షగానం, 6 గంటలకు హొస్పేట స్వర్ణముఖి భరతనాట్య పాఠశాల విద్యార్థుల నాట్య
ప్రదర్శన.
పోటీలు
ఉదయం పది గంటలకు గ్రామీణ క్రీడా పోటీలు, కుస్తీ పోటీ, గాలి పటాలు ఎగురవేడయం, హాట్ ఎయిర్ బెలూన్, సాహస క్రీడలు, పేయింట్ బాల్, ఏటీవీ పోటీలు, ఉదయం 11 గంటలకు కిచెన్క్యూన్ పోటీలు, వికలాంగుల క్రీడాపోటీలు, హంపి బైక్స్కై, హోటల్ భువనేశ్వరి ఆవరణంలో 10.30 గంటలకు వికలాంగులకు క్రీడా పోటీలు, కమలాపురం పాఠశాల ఆవరణంలో 11.45 గంటలకు జరుగుతాయి.