రైళ్లలో ఫుడ్.. రైల్వే కీలక చర్యలు
దేశంలో అత్యధిక మంది ఉపయోగించే ప్రయాణ సాధనం రైలు. దేశవ్యాప్తంగా నిత్యం కొన్ని వేల రైళ్లు నడుస్తున్నాయి. లక్షల సంఖ్యలో ప్రయాణికులు వీటి ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రైళ్లలో అత్యంత ప్రధాన సమస్య ఆహారం. రైళ్లలో లభించే ఆహారం నాణ్యత లేకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటం వంటి వాటితో ప్రయాణికులు ఇబ్బందులు పడతుంటారు. ఈ సమస్యలు నివారించేందుకు రైల్వే శాఖ కీలక చర్యలకు ఉపక్రమించింది.పారదర్శకతను పెంపొందించడానికి, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ముఖ్యమైన చర్యలో భారతీయ రైల్వే అన్ని రైళ్లలో ఆహార ధరలతోపాటు మెనూలను ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేసింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన ఈ చొరవ ప్రయాణికులకు అందుబాటులో ఉన్న ఆహార ఎంపికలు, వాటి ధరల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించేలా చేస్తుంది.రైల్వే శాఖ ముఖ్యమైన చర్యలు ఇవే..ప్రింటెడ్ మెనూ కార్డులు: ప్రయాణికులు ఇప్పుడు ఆన్ బోర్డ్ వెయిటింగ్ స్టాఫ్ నుండి ప్రింటెడ్ మెనూ కార్డులను కోరవచ్చు. ఈ కార్డులు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలను, వాటి ధరలను తెలియజేస్తాయి.డిజిటల్ యాక్సెస్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఈ మెనూలను తన అధికారిక వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు లేదా ప్రయాణ సమయంలో ఆహార ఎంపికలు, ధరలను సమీక్షించవచ్చు.ఎస్ఎంఎస్ అలర్ట్స్: పారదర్శకతను మరింత పెంచడానికి భారతీయ రైల్వే ఆహార మెనూ, టారిఫ్ వివరాలకు సంబంధించిన లింక్‌లను ప్రయాణికులకు ఎస్ఎంఎస్ అలర్ట్‌ల రూపంలో అందిస్తోంది.ప్యాంట్రీ కార్ డిస్ప్లేలు: రైళ్లలోని ప్యాంట్రీ కార్లలో రేట్ లిస్ట్ లు ప్రముఖంగా ప్రదర్శిస్తారు. ఇది ప్రయాణికులకు ధరలను సరిపోల్చుకోవడం సులభం చేస్తుంది.ఆధునిక బేస్ కిచెన్లు: ప్రామాణిక ఆహార తయారీ ప్రక్రియలను నిర్ధారించడానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన నిర్దేశిత బేస్ కిచెన్లలో భోజనాన్ని తయారు చేస్తారు.సీసీటీవీ మానిటరింగ్: ఆహార తయారీని రియల్ టైమ్ మానిటరింగ్ చేయడానికి, భద్రతా ప్రోటోకాల్స్ పాటించేలా చూడటానికి బేస్ కిచెన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.బ్రాండెడ్ పదార్థాలు: స్థిరమైన ఆహార నాణ్యతను నిర్వహించడానికి వంట నూనె, పిండి, బియ్యం, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పనీర్, పాల ఉత్పత్తులు వంటివాటికి సంబంధించి బ్రాండెడ్ ముడి పదార్థాలను ఉపయోగించడాన్ని రైల్వే తప్పనిసరి చేస్తుంది.ఫుడ్ సేఫ్టీ సూపర్ వైజర్లు: క్వాలిఫైడ్ ఫుడ్ సేఫ్టీ సూపర్ వైజర్లు బేస్ కిచెన్లలో ఫుడ్ సేఫ్టీ, పరిశుభ్రతా పద్ధతులను పర్యవేక్షిస్తారు.అదనపు చర్యలురవాణా సమయంలో ఆహార నాణ్యతలో ఉన్నత ప్రమాణాలను నిర్వహించడానికి, భారతీయ రైల్వే పలు వినూత్న చర్యలను ప్రవేశపెట్టింది.ఆహార ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్స్: ఆహార ప్యాకెట్లలో ఇప్పుడు క్యూఆర్ కోడ్లు ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడ తయారైంది.. ప్యాకేజింగ్ తేదీ వంటి వివరాలను ప్రదర్శిస్తాయి.రెగ్యులర్ ఆడిట్లు, తనిఖీలు: ప్యాంట్రీ కార్లు, బేస్ కిచెన్ ల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యతను మదింపు చేయడానికి రొటీన్ ఫుడ్ శాంప్లింగ్, థర్డ్ పార్టీ ఆడిట్ లు నిర్వహిస్తారు.ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్: అన్ని క్యాటరింగ్ యూనిట్లు నేషనల్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్‌కు కట్టుబడి ఉండేలా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నుంచి సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది.