50 మంది ఎర్రచందనం కూలీలు పరారీ
ఎర్రచందనం దుంగలను నరికేందుకు వచ్చిన 50 మంది ఎర్రచందనం కూలీలు పోలీసులను చూసి పరారయ్యారు. వీరంతా ఓ టూరిస్టు బస్సులో నకిలీ నంబర్‌ప్లేటు తగిలించుకుని వచ్చారు. కడప నగర శివారు కనుమలోపల్లి వద్ద పోలీసులు బస్సును తనిఖీ చేయడానికి ప్రయత్నించిన విషయం తెలుసుకుని.. పారి పోయారు.
బస్సులో ఉన్న గొడ్డళ్లు, కూరగాయలు, బియ్యం మూటలను అటవీశాఖ ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బస్సును సీజ్ చేశారు. పరారై న కూలీల కోసం టాస్స్‌ఫోర్స్, స్పెషల్ పార్టీ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.