app కీ కహానీ...
ఫారెక్స్ క్యాలెండర్
మీరు ఫారెక్స్ ట్రేడరా? అయితే ‘ఫారెక్స్ క్యాలెండర్, మార్కెట్ అండ్ న్యూస్’ యాప్ను ఉపయోగించి చూడండి. ఈ యాప్ ద్వారా మీరు ఫారెక్స్ మార్కెట్కు సంబంధించిన సమాచారం, వివరాలు, విశ్లేషణలు వంటి తదితర చాలా అంశాలను తెలుసుకోవచ్చు. యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
► యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్.
► మీ ఫారెక్స్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకోవచ్చు. పోర్ట్ఫోలియో లేకపోతే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు.
► యాప్లో పోర్ట్ఫోలియో, ఎకనమిక్ క్యాలెండర్, ఫారెక్స్ మార్కెట్స్, ఫారెక్స్ చార్ట్స్, ఫారెక్స్ న్యూస్, కమ్యూనిటీ ఔట్లుక్ వంటి తదితర ఆప్షన్స్ ఉంటాయి.
► పోర్ట్ఫోలియో ఆప్షన్లోకి వెళితే మీరు మీ మైఎఫ్ఎక్స్బుక్ సంబంధిత పోర్ట్ఫోలియో వివరాలను చూసుకోవచ్చు.
►ఇక మార్కెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా దాదాపు 60 ఫారెక్స్ కరెన్సీ సంబంధిత విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
►ఇండికేటర్స్, టెక్నికల్ విశ్లేషణతో కూడిన లైవ్ ఫారెక్స్ చార్ట్స్ అయితే ఫారెక్స్ చార్ట్స్ ఆప్షన్లో అందుబాటులో ఉంటాయి.
►ఫారెక్స్ న్యూస్ ఆప్షన్లో ఆర్థిక సంబంధిత వార్తలను తెలుసుకోవచ్చు.
► ట్రేడ్స్ను ప్లాన్ చేసుకోవడానికి అనువుగా ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది.
►యాప్లో టాప్ ఫారెక్స్ బ్రోకర్స్ వివరాలు అందుబాటులో ఉంటాయి.