former beauty queen
-
‘జెల్లె స్కామ్’.. డబ్బులు పోగొట్టుకున్న అమెరికన్ బ్యూటీ
అమెరికన్ బ్యూటీ బ్రియానా సియాకా ‘జెల్లె స్కామ్’లో డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ స్కామ్ పట్ల అందరూ అప్రమత్తంగా హెచ్చరించారు. అసలేంటీ స్కామ్, డబ్బులు ఎలా పోగొట్టుకున్నది ఆమె వివరించారు.న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. యూఎస్‌లో మాజీ మిస్ న్యూయార్క్ అయిన బ్రియానా సియాకా టిక్‌టాక్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఇద్దరు యువకులు తన నుంచి 2,000 డాలర్లు (రూ. 1.66 లక్షలు) ఎలా లాక్కున్నారో వివరించారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న సియాకా, తాను మాడిసన్ స్క్వేర్ పార్క్‌లో కూర్చుని పాడ్‌కాస్ట్ వింటుండగా ఇద్దరు కుర్రాళ్లు తన వద్దకు వచ్చి తమ బాస్కెట్‌బాల్ జట్టు కోసం నిధులు సేకరిస్తున్నామని, తమకు సహాయం చేయాలని కోరారని చెప్పారు.తాను వారికి కొంత డబ్బు ఇవ్వడానికి అంగీకరించానని, కానీ తన వద్ద నగదు లేకపోవడంతో జెల్లె యాప్ ద్వారా చెల్లించేందుకు ఒప్పుకొన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తమ అకౌంట్ వివరాలు నమోదు చేసేందుకు తన ఫోన్ తీసుకున్నాడని, మరో కుర్రాడు తనను మాటల్లో పెట్టగా అతను తన అకౌంట్ నుంచి 2,000 డాలర్లు వారి ఖాతాకు మళ్లించుకున్నారని వివరించారు. న్యూయార్క్ పోలీసుల ప్రకారం, ఇది చాలా సాధారణమైన స్కామ్. దీని దుండగులు విరాళాల పేరుతో డబ్బును స్వాహా చేస్తారు."నేను ఆశ్చర్యపోయాను. ఈ అబ్బాయిలు చాలా మంచిగా, అమాయకంగా మాట్లాడితే వారు నిజంగానే తమ జట్టు కోసం విరాళాలు సేకరిస్తున్నారని అనుకున్నాను" అని సియాకా చెప్పారు. జెల్లె (Zelle) అనేది జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికాతో సహా ఏడు బ్యాంకుల యాజమాన్యంలోని పీర్-టు-పీర్ నెట్వర్క్. 2017లో ప్రారంభమైన జెల్లె అతిపెద్ద యూఎస్ పీర్-టు-పీర్ చెల్లింపుల నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఎదిగింది. -
దేశం కోసం తుపాకీ పట్టిన మాజీ మిస్ ఉక్రెయిన్
రష్యా దాడితో ఉలిక్కిపడ్డ ఉక్రెయిన్ తన వద్ద ఉన్న తక్కువ ఆయుధాలు, సైన్యంతో పోరాడుతోంది. బలబలాల విషయంలో రష్యాకు ఏమాత్రం పోటీ ఇవ్వలేని స్థితిలో ఉక్రెయిన్ ఉన్నప్పటికీ శక్తి వంచన లేకుండా రష్యన్ బలగాలను ఎదుర్కుంటోంది. చివరికి దేశాధ్యక్షుడు జెలెన్స్కీ సైతం యుద్ధభూమిలోకి దిగి దేశ ప్రజలకు కూడా ఆయుధాలు ఇస్తామని పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల నుంచి సెలబిట్రీల సైతం ఆయుధాలు చేతబట్టి రణరంగంలో దిగుతున్నారు. తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన అందాల భామ కూడా ఆర్మీలో చేరారు. ఆమె ఎవరో కాదు.. 2015 లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్‌లో ఉక్రెయిన్ తరపున పాల్గొన్న బ్యూటీ అనస్తాసియా లెన్నా. ప్రస్తుతం ఆమె గన్ను పట్టి శత్రువులను మట్టుబెట్టేందుకు యుద్ధభేరిలో పాల్గొంటున్నారు. View this post on Instagram A post shared by Miss Ukraine🇺🇦Anastasiia Lenna (@anastasiia.lenna) -
మోడల్‌పై మాజీ ప్రియుడి యాసిడ్ దాడి
ఆమె మాజీ బ్యూటీక్వీన్. ఇప్పుడు కూడా టాప్ మోడళ్లలో ఒకరు. అలాంటి మోడల్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఆ దాడి చేసింది కూడా ఎవరో కాదు.. ఆమె మాజీ బోయ్‌ఫ్రెండు. మాజీ మిస్ ఇటలీ అయిన జెస్సికా నొటారో ముఖంపై అతడు యాసిడ్ పోయడంతో ఇప్పుడు ఆమె కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. టీవీ ప్రెజెంటర్గాను, డాల్ఫిన్ల శిక్షకురాలిగా కూడా పనిచేసిన నొటారోకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. యాసిడ్ దాడితో ఆమె తీవ్రంగా గాయపడటంతో సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆమె ముఖం మీద, కళ్లలోకి బాగా లోపలి వరకు యాసిడ్ గాయాలు కావడంతో.. ప్లాస్టిక్ సర్జరీ తప్పడం లేదని, ఆమె కాళ్ల మీద, పిరుదుల మీద కూడా యాసిడ్ పడిందని చెబుతున్నారు. నిందితుడు, నొటారో మాజీ బోయ్‌ఫ్రెండు జార్జ్ ఎడ్సన్ టవారెస్ను అరెస్టు చేశారు. అయితే, తాను ఆ దాడి చేయలేదని అతడు వాదిస్తున్నాడు. ఒక అక్వేరియంలోని డాల్ఫిన్ షోలో పనిచేసే సమయంలో 2014లో ఎడ్సన్ను నొటారో తొలిసారి కలిసింది. రెండేళ్ల బంధం అనంతరం ఇద్దరూ గత వేసవిలో విడిపోయినా, అతడు తరచు వెంటపడుతూ వేధిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వెంటపడటం మాత్రం మానలేదు. ఇన్ని బాధలు ఉన్నా నొటారో ఎప్పుడూ నవ్వుతూనే ఉండేదని, ఆశాభావంతో ఉండేదని స్నేహితులు చెప్పారు. ఆమె మంచి గాయని, డాన్సర్ కూడా అని, తరచు టీవీ షోలలో కనిపించేదని అన్నారు.