దేశం కోసం తుపాకీ పట్టిన మాజీ మిస్‌ ఉక్రెయిన్‌ | Russia Ukraine Crisis:former Miss Ukraine Joins Army To Fight Against Russia | Sakshi
Sakshi News home page

దేశం కోసం తుపాకీ పట్టిన మాజీ మిస్‌ ఉక్రెయిన్‌

Published Mon, Feb 28 2022 9:30 PM | Last Updated on Mon, Feb 28 2022 9:46 PM

Russia Ukraine Crisis:former Miss Ukraine Joins Army To Fight Against Russia - Sakshi

రష్యా దాడితో ఉలిక్కిపడ్డ ఉక్రెయిన్‌ తన వద్ద ఉన్న తక్కువ ఆయుధాలు, సైన్యంతో పోరాడుతోంది. బలబలాల విషయంలో రష్యాకు ఏమాత్రం పోటీ ఇవ్వలేని స్థితిలో ఉక్రెయిన్‌ ఉన్నప్పటికీ శక్తి వంచన లేకుండా రష్యన్‌ బలగాలను ఎదుర్కుంటోంది. చివరికి దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం యుద్ధభూమిలోకి దిగి దేశ ప్రజలకు కూడా ఆయుధాలు ఇస్తామని పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సామాన్య ప్రజల నుంచి సెలబిట్రీల సైతం ఆయుధాలు చేతబట్టి రణరంగంలో దిగుతున్నారు. తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన అందాల భామ కూడా ఆర్మీలో చేరారు. ఆమె ఎవరో కాదు.. 2015 లో మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ బ్యూటీ కాంటెస్ట్‌లో ఉక్రెయిన్‌ తరపున పాల్గొన్న బ్యూటీ అనస్తాసియా లెన్నా. ప్రస్తుతం ఆమె గన్ను పట్టి శత్రువులను మట్టుబెట్టేందుకు యుద్ధభేరిలో పాల్గొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement