former Chief Minister Karunanidhi
-
విషమంగా కరుణానిధి ఆరోగ్యం
-
కరుణానిధికి ఇన్ఫెక్షన్, జ్వరం
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి(94) మూత్రనాళ ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి 7.30 గంటల నుంచి ప్రత్యేక వైద్య బృందం కరుణానిధి ఇంటిలోనే ఉండి చికిత్స అందిస్తోంది. వయో భారం, అనారోగ్య సమస్యలతో రెండేళ్లుగా కరుణానిధి గోపాలపురంలోని ఇంటికే పరిమితమయ్యారు. రెండు నెలల క్రితం కరుణ ఆరోగ్యం కుదుటపడిందని, త్వరలో ప్రజాసేవకు అంకితమవుతారని డీఎంకే కార్యాలయం ప్రకటించింది. డీఎంకే అధినేతగా పగ్గాలు చేపట్టి 50వ వసంతంలోకి అడుగు పెడుతుండడంతో శుక్రవారం స్వర్ణోత్సవ కార్యక్రమాలకు డీఎంకే వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం కరుణ ఆరోగ్యం క్షీణించడం గమనార్హం. కాగా, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను కలసి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ కరుణానిధిని చూసి వెళ్లారు. -
అరుళ్‌నిధికి పెళ్లి కుదిరింది
యువ నటుడు డీఎంకే నేత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఎం.కె.తమిళరసన్ కొడుకు అయిన అరుళ్నిధికిపెళ్లి కుదిరింది. చెన్నైకి చెందిన మాజీ న్యాయమూర్తి కుమార్తె కీర్తనను వివాహమాడనున్నారు. వంశం చిత్రంతో కథా నాయకుడిగా పరిచయం అయిన అరుళ్‌నిధి. ఆ తరువాత మౌన గురు, ఒరు కన్నియుం మూడు కళవానిగళుం తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం నాలు పోలీసుం నల్లా ఇరుంద ఊరుం చిత్రంలో నటిస్తున్నారు. చెన్నైకి చెందిన పూర్వపు న్యాయమూర్తి కూతురు కీర్తనతో అరుళ్‌నిధి వివాహం నిశ్చయించారు. వీరి నిశ్చితార్థం సోమవారం రాత్రి నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. దీనికి కరుణానిధితోపాటు ఆయన భార్య రాజాత్తి అమ్మాళ్, కొడుకు స్టాలిన్, కూతురు కనిమొళి, అళగిరితోపాటు బంధుమిత్రులు పాల్గొన్నారు. అయితే వివాహమెప్పుడన్నది ప్రకటించలేదు.