నేడు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాక
పీలేరు: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం రాత్రి పీలేరు కు రానున్నారు. గురువారం రాత్రి పీలే రు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో కేవీ పల్లె మండలం గ్యారంపల్లెకు చెందిన సమైక్యాంధ్ర పార్టీ నేత వెంకట్రమణారెడ్డి కుమార్తె వివాహానికి ఆయన హాజ రుకానున్నారు.
గురువారం ఉదయం బెంగళూరు నుంచి స్వగ్రామమైన కలికిరి నగిరిపల్లెకు చేరుకుంటారు. అనంతరం రాత్రి పీలేరుకు వ చ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారని ఆయన అనుచరులు తెలిపారు.