మైనర్పై సైనికాధికారుల కుమారులు లైంగిక దాడి
గూర్గావ్: హర్యానాలో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. గూర్గావ్లో పదకొండేళ్ల బాలికపై మాజీ సైనిక అధికారుల కుమారులు లైంగిక దాడి పాల్పడ్డారు. ఆ లైంగిక దాడిని వీడియో తీసి ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేశారు. తమకు డబ్బు, ఒంటిపై ఉన్న బంగారం ఇవ్వకుంటే వీడియో బయటపెడతామని బెదిరించారు.
అందుకు ఆ మైనర్ బాలిక నిరాకరించగా కొట్టి బలవంతంగా లాక్కున్నారు. ఈ విషయాన్ని బాలిక పోలీసులకు ఫిర్యాదుచేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ నిందితుల వివరాలు తెలియజేస్తూ వారు మాజీ సైనిక అధికారుల కుమారులు అని చెప్పారు. ఆ అధికారులు లెఫ్టినెంట్ కమాండర్లుగా భారత సైన్యంలో పనిచేశారని కూడా వివరించారు. లైంగిక దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించి విచారించగా వారు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.