Former Woman Police Officer
-
అనుపమ రాజీనామాలో ట్విస్ట్
బళ్లారి: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన బళ్లారి జిల్లా కూడ్లిగి డీఎస్పీ అనుపమ షెనాయ్ రాజీనామా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అనుపమ రాజీనామా విషయలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. కర్ణాటక మంత్రి పరమేశ్వర్ నాయక్ తన విధుల్లో జోక్యం చేసుకుని ఆటంకం కలిగించారని, తనన బెదిరించారని ఆరోపిస్తూ అనుపమ ఉద్యోగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనుపమ రాజీనామాను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించినట్టు వార్తలు వచ్చాయి. అనుపమ తన రాజీనామా లేఖలో మంత్రి పరమేశ్వర్ నాయక్ పేరును ప్రస్తావించడంపై ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి ప్రస్తావన లేకుండా మరో రాజీనామా లేఖ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అనుపమ మంత్రి పేరు ప్రస్తావనకు తీసుకురాకుండా రెండోసారి రాజీనామా లేఖను అందజేసింది. ఈ రాజీనామా లేఖకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
నాకు ప్రాణహాని ఉంది: అనుపమ
బెంగళూరు: సంచలన మాజీ పోలీస్ ఉన్నతాధికారిణి, కర్ణాటకలోని బళ్లారి జిల్లా కుడ్లిగి మాజీ డీఎస్పీ అనుపమ షెనాయ్ తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుపమ రాజీనామాను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది. కాగా ఎవరి నుంచి ప్రాణహాని ఉంది, బెదిరింపులు ఏమైనా వచ్చాయా అన్న విషయాలను ఆమె వెల్లడించలేదు. కర్ణాటక మంత్రి పరమేశ్వర్ నాయక్‌కు సంబంధించిన సీడీ, ఆడియోలను బెంగళూరులో మీడియా సమక్షంలో విడుదల చేయనున్నట్టు చెప్పారు. అనుపమ రాజీనామా వ్యవహారం కర్ణాటకలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి పరమేశ్వర్ నాయక్ తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ఆమె రాజీనామా చేశారు. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆయన రాసలీలల వీడియో తన దగ్గర ఉందని, దాన్ని బయటపెడతానని ఆమె హెచ్చరించారు. కొన్ని రోజులు అజ్ఞాతంలో గడిపన అనుపమ రెండు రోజుల క్రితం కుడ్లిగి వచ్చారు. కాగా అనుపమ రాజీనామాను కర్ణాటక ప్రభుత్వం ఆమోదించినందుకు బళ్లారి జిల్లాలో నిరసనలు వ్యక్తమయ్యాయి.