సమీకరణమే
రూ. 28 లక్షలు పరిహారం వద్దన్న రైతులు
స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన
ఎకరానికి రూ. 50 లక్షలు డిమాండ్
అలా అయితేనే... లేకుంటే భూములే ఇవ్వం..
బలవంతంగా తీసుకుంటే ప్రాణత్యాగానికి సిద్ధం
విష గుళికలతో బైఠాయింపు
సీతానగరం (రాజానగరం) :
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి పంట భూములు ఇచ్చేది లేదంటూ భూ నిర్వాసిత రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద రామచంద్రపురం, చినకొండేపూడి, వంగలపూడి, నాగంపల్లి రైతులు నిరసన కార్యక్రమం జరిపారు. వారి వెంట పంటపొలంలో వేసే గుళికల ప్యాకెట్ తెచ్చి బలవంతంగా భూములు తీసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు. మా భూములు ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసని రైతులు ధీమా వ్యక్తం చేశారు. మూడు పంటలు పండే భూములకు కేవలం రూ.28 లక్షలు ముష్టిగా ప్రభుత్వం ఇస్తుందా అని ప్రశ్నించారు. ఎకరానికి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అదీ ఒ¯ŒSటైమ్ సెటిల్మెంట్గా నగదు అందించిన తర్వాతే భూముల్లో పనులు చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టులో భూసేకరణ నాలుగేళ్ళ నుంచీ జరుగుతోందని, పట్టిసీమ ఎత్తిపోతల ప«థకం భూ నిర్వాసితులకు ఇంకా పరిహారం అందుకోని రైతులున్నారని వివరించారు. పైప్‌లై¯ŒS పనులు జరగనిచ్చేది లేదని, రైతులను విడగొట్టి, భయపెట్టి సంతకాలు పెట్టిస్తున్నారని రైతులు ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్‌కు రైతులు వినతిపత్రాలను అందించారు. పెద్ద ఎత్తున రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.