రెవెన్యూ డివిజన్ సాధనకు ఉద్యమం ఉధృతం
కల్వకుర్తి రూరల్ : అన్ని అర్హతలుండి ప్రభుత్వ నివేదికలో సైతం స్థానం కల్పించిన కల్వకుర్తికి రెవెన్యూ డివిజన్ మంజూరు చేసే వరకు ఉద్యమం ఉధృత్తం చేస్తామని అఖిలపక్షం నేతలు ప్రకటించారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ శ్రీశైలంలు మాట్లాడుతూ భవిష్యత్తు తరాల బాగు కోసం రెవెన్యూ డివిజన్ తప్పనిసరన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం డివిజన్ సాధించేందుకు కలిసికట్టుగా ఉద్యమిద్దామన్నారు. కడ్తాలను మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ ఐక్యమత్యంగా కలిసిమెలిసి ఉద్యమాన్ని ముం దుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. స్వచ్ఛందంగా ప్రజలు ఉద్యమంలో భాగస్వామ్యులవుతున్నారని వెల్లడించారు. నగర పంచాయతీ, జిల్లెల, జంగారెడ్డిపల్లితో పాటు కల్వకుర్తి మండల ప్రజాపరిషత్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మా నం చేయడం పట్ల హర్షం ప్రకటించారు. అన్ని మండలాలు, గ్రామాలు తీర్మానాలు చేయాలని కోరారు. ఉద్యమంలో భాగంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రులను, సీసీఎల్ఏ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందిస్తామని తెలిపారు
నియోజకవర్గాన్ని విడదీÄñæ¬ద్దు
కల్వకుర్తికి రెవెన్యూ డివిజన్ మంజూరు చేయడంతో పాటు ఐదు మండలాలను నియోజకవర్గం నుంచి విడదీÄñæ¬ద్దన్నారు. మూడు మండలాలను ఇతర జిల్లాల్లో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని అది మంచి పద్ధతి కాదని, నియోజకవర్గం మొత్తాన్ని ఒకే చోట ఉంచాలని, అది ఎక్కడైనా సరే అని అఖిలపక్షం నేతలు కోరారు. సమావేశంలో జేఏసీ కన్వీనర్ సదానందం, నగర పంచాయతీ వైస్ చైర్మన్ షాహేద్, నాయకులు మిర్యాల శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మ సురేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, జగన్, దుర్గాప్రసాద్, రాఘవేందర్‌గౌడ్, శ్రీధర్, సూరి, నర్సింహ, పాండుయాదవ్‌లు పాల్గొన్నారు.