పచ్చి మోసం
రైతులను దగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
రైతు సంఘం చర్చా వేదికలో వక్తలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రైతులను పచ్చిగా మోసం చేస్తున్నారని రైతు సంఘం ఏర్పాటు చేసిన చర్చావేదికలో వక్తలు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘ఎండిన వేరుశనగ పంట–రెయిన్గన్లు’ అనే అంశంపై స్థానిక ప్రెస్‌క్లబ్‌లో రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం చర్చా వేదిక నిర్వహించారు.
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.పెద్దిరెడ్డి అధ్యక్షత వహిం చారు. ఆయన మాట్లాడుతూ రక్షక తడుల పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోందన్నారు. రక్షకతడితో పంటను మాత్రం రక్షించలేక పో యారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ రెయిన్గన్ల సృష్టికర్తే తానేనన్నుట్టు చం ద్రబాబు రైతులను నమ్మిస్తున్నారని ఆరోపించారు.
వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కరువును ఎలా ఎదుర్కోవాలి, శాశ్వత నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న ఆలోచనను పూర్తిగా విస్మరిం చారన్నారు. చంద్రబాబు రైతులను ద గా చేస్తున్నారన్నారు. కూలీలకు పను లు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాయలసీమలో 22 లక్షల ఎకరాల్లో వేరశనగను సాగుచేశారన్నారు. ఇందులో ఆగస్టులోనే 12 లక్షల ఎకరాల్లోని పంట సరైన సమయంలో నీరు అందక చేజారిందన్నారు. మొత్తం పంటను రక్షించడానికి 8 టీఎంసీల నీరు అవసరమవుతాయన్నారు. అంతనీటిని ఎక్కడి నుంచి తెచ్చారని, ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రక్షకతడుల ద్వారా రైతులకు చెందిన రూ.199 కోట్ల పంటను రక్షించగలిగామని, రూ. 59 కోట్ల 62 లక్షల విలువ చేసే ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వానికి మిగులుబాటు చేశామని చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. ఇలాంటి ప్రకటనల ద్వారా ఇన్పుట్ సబ్సిడీ ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి ఫసల్‌బీమా లో వేరుశనగ ను చేర్చేవిధంగా చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. వాతావరణాన్ని గ ణించడానికి ఉన్న వెదర్స్టేçÙన్లు ఎక్కడా పనిచేయడం లేదన్నారు. ప్రతి ఏడాది జూన్æ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదు కాకపోతే పంటకు జరిగిన నష్టాన్ని వెల కట్టి రైతుల ఖాతాలకు ఇన్సూరెన్స్ కంపెనీలు పరిహారం జమ చేయాలని డి మాండ్ చేశారు. విజయవాడ నుంచి బులెటిన్ విడుదల చేసి రక్షించామని తప్పుడు మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదన్నారు.
వైఎస్సార్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకట చౌదరి, కదలిక ఎడిటర్ ఇమాం, సీపీఐ ఎమ్ ఎల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రమణ, సీపీఐ కార్యవర్గ సభ్యులు కా టమయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, రైతు సంఘాల సమాఖ్య నాయకులు రామక్రిష్ణ, రైతు సంఘం నాయకులు రామాంజినేయులు, చంద్రశేఖర్‌రెడ్డి, సుబ్బిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.