భూమికి అతి సమీపంలోకి అంగారక గ్రహం
2016 మే 30న అరుదైన సంఘటన
{పయోగాలు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
ప్లానెటరీ సొసైటీ ఇండియా {పతినిధుల వెల్లడి
కవాడిగూడ: వచ్చే ఏడాది మే 30న అంగారక గ్రహం భూమికి అతి సమీపంలోకి రాబోతోందని ప్లానెటరీ సొసైటీ ఇండియా ఫౌండర్ కార్యదర్శి ఎన్.రఘునందన్ కుమార్ తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్సీఐ, డీఆర్డీవో సైంటిస్టు శ్రీనివాస శాస్త్రి, ఉస్మానియా విశ్వ విద్యాలయం ఎమిరిటస్ హెచ్ఓడీ ప్రొఫెసర్ జి.రామ్‌దాస్, ఐసీఎస్ఎస్ మాజీ ఛైర్మన్ కేకే రావులతో కలిసి ఆయన మాట్లాడారు. 2016 మే 22న భూమి, సూర్యుడు, అంగారకుడు ఒకే సరళ రేఖపైకి వస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో అంగారకుడు అత్యంత కాంతివంతంగా కన్పిస్తాడని, ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. అంగారకుడు మే 22వ తేదీ కంటే తిరుగు ప్రయాణంలో 30వ తేదీన మరింత దగ్గర కానున్నట్లు తెలిపారు. బుధవారం భూమికి అంగారక గ్రహం 378 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటే వచ్చే ఏడాది మే 30వ తేదీకి 75.28 మిలియన్ కిలోమీటర్ల సమీపంలోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఏడాది పాటు విద్యా సంస్థల్లో గ్రహాల స్థితిగతులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మన పేర్లను పంపొచ్చు...
అంగారక గ్రహంపైకి మనం వెళ్లకపోయినా మన పేర్లను మాత్రం పంపవచ్చని ప్లానెటరీ సొసైటీ ఇండియా కార్యదర్శి రఘునందన్‌కుమార్ తెలిపారు. ఇందుకు ఠీఠీఠీ.ౌఠటఞ్చ్ఛ్టట.జీజౌ వెబ్సైట్లో, ఫేస్బుక్లో నమోదు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 93475 11132 నంబర్లో సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాల పోస్టర్‌ను అవిష్కరించారు.