విద్యార్థుల నిరసన
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : విద్యార్థులకు, సిబ్బందికి వ్యవస్థాపక దినోత్సవం గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో విద్యార్థులు వేదిక ముందు బైఠాయించి తమ నిరసన తెలిపారు. బుధవారం నాడే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వర్సిటీ ఉన్నతాధికారులు సర్క్యులర్‌ను పంపిం చ డంతో విద్యార్థులు, సిబ్బంది అవాక్కయ్యారు. గత ంలో జరిగిన పొరపాట్లను సరి చేసుకుని ఈ సారైనా విద్యార్థులకు ముందస్తు సమాచా రం ఇవ్వకుండా మళ్లీ అదే రీతిలో జరపాలని యత్నించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక ముందు బైఠాయించి విద్యార్థులు నిరసన తెలుపడంతో పాటు వీసీని నిలదీశారు.
దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీసీ, ముందస్తు సమాచారం గురించి ప్రిన్సిపాల్ ధర్మరాజును అడగాలని తనను అడగవద్దన్నారు. విద్యార్థులను రిజి స్ట్రార్ లింబాద్రి సముదాయించారు. ఇవన్నీ చూసి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ ప్రద్యుమ్న ఆశ్చర్యపోయారు. ఇలా జరుగకుండా చూడాలని వర్సిటీ అధికారులకు సూచించారు. సమయాభావం వల్ల అందరికి సకాలంలో సమాచారం ఇవ్వలేకపోయినందుకు చింతిస్తున్నామని రిజిస్ట్రార్ సభాముఖంగా తెలియజేయాల్సి వచ్చింది.
నెపాన్ని తనపై నెట్టడంతో ప్రిన్సిపాల్ మనస్థాపానికి గురయ్యారు. వేదిక పైకి పిలిచినా కొంత సేపటి వరకు ఆయన వెళ్లలేదు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ.. ఒక పాఠశాల వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇంతకంటే ఘనంగా నిర్వహిస్తారనిఅధికారుల ఒంటెత్తు పోకడల వల్ల వచ్చిన అతిథుల ముందు వర్సిటీ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు.