four houses
-
నామాపూర్‌లో చోరీ
రూ. 76 వేల నగదు, ఏడు తులాల బంగారం అపహరణ ముస్తాబాద్ : మండలంలోని నామాపూర్‌లో గురువారం రాత్రి దొంగలు నాలుగు ఇళ్లలో చోరికి పాల్పడ్డారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఏఎసై ్స రాజిరెడ్డి, బాధితుల కథనం ప్రకారం.. నామాపూర్‌కు చెందిన తాడెపు రవి కుమారుడికి ముస్తాబాద్ ఆస్పత్రిలో ఆపరేషన్ జరగగా ఇంటికి తాళం వేసి వెళ్లారు. దొంగలు రవి ఇంటిలో దూరి బీరువాలో ఆపరేషన్ కోసం దాచిన రూ.70 వేల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పొన్నం రామచందర్‌రెడ్డి ఇంటికి తాళం వేసి కుటుంబీకులతో బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లోనూ దొంగలు పడ్డారు. బీరువాలోని మూడు తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. అక్కడి నుంచి మేర్గు అంజాగౌడ్ ఇంట్లోకి వెళ్లి బీరువాలోని రూ.6 వేల నగదు, తులం బంగారు గొలుసు, 20 తులాల వెండి గాజులు అపహరించారు. మేర్గు రామచంద్రం ఇంట్లోనూ చోరీ చేశారు. అయితే వారు లేకపోవడంతో వివరాలు తెలియాల్సి ఉంది. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో.. ఏఎసై ్స రాజిరెడ్డి నామాపూర్‌కు వెళ్లి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. కరీంనగర్ నుంచి క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎసై ్స తెలిపారు. -
నామాపూర్‌లో నాలుగు ఇళ్లలో చోరీ

నాలుగిళ్లలో చోరీ
రామాయంపేట: నాలుగిళ్లలో చోరీ జరిగిన సంఘటన పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. రామాయంపేట పోలీసుల కథనం మేరకు పట్టణంలోని వడ్లపాండు ఇంట్లోంచి అరతులం బంగారం, పది తులాల వెండి ఆభరణాలు, యాదగిరి అనే వ్యక్తి ఇంట్లోంచి రూ.20వేల నగదు, ఐదు తులాల వెండి ఆభరణాలు, ప్రభాకర్ అనే వ్యక్తి ఇంట్లోంచి 15తులాల వెండి ఆభరణాలు, లంబాడి గంగమ్మ ఇంట్లోంచి 20 తులాల వెండి ఆభరణాలు, అరతులం బంగారు ఆభరాణాలు, రూ. 3వేల నగదు ఎత్తుకెళ్లారు. కాగా రాజు, జయమ్మ అనే వ్యక్తుల ఇళ్ల తాళాలు పగులు గొట్టినప్పటికీ వారింట్లో ఏమీ ఎత్తుకెళ్లలేదని తెలిపారు. మరో రెండు బైక్‌లు ఎత్తుకెళ్లిన దుండగులు గ్రామశివారులో వదిలి వెళ్లారు. దొంగలు మొత్తం రూ.23 వేల నగదు, 50 తులాల వెండి ఆభరణాలు, తులం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు రామాయంపేట ఎస్ఐ నాగార్జునగౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.