Four kids
-
తెలంగాణలో అరుదైన సంఘటన: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
హైదరాబాద్: హైదరబాద్ నగరంలో.. మెహదీపట్నంలో గల మీనా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన సంఘటన జరిగింది. 27 ఏళ్ల ఒక మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా, వారిలో ముగ్గురు ఆడపిల్లలుకాగా, ఒక మగ పిల్లవాడు జన్మించాడు. ప్రస్తుతం తల్లి, నలుగురు పిల్లలు క్షేమంగా ఉన్నారని.. ఆసుపత్రి గైనకాలజిస్ట్ సోహేబా షుకో తెలిపారు. Telangana | A 27-year-old woman gives birth to quadruplets in Hyderabad The women gave birth to a baby boy and three baby girls. All the babies and the mother are healthy: Dr. Soheba Shukoo, Obstetrician and gynaecologist, Mina Multispeciality Hospital pic.twitter.com/nI5xvGLV2l — ANI (@ANI) October 27, 2021 చదవండి: బద్వేలు ఉప ఎన్నికల్లో వార్ వన్‌సైడే: ఎమ్మెల్యే రోజా -
‘మూత’పడిన బడి..!
♦ నలుగురు పిల్లలే చేరడంతో బడికి తాళం వేసిన అధికారులు ♦ ఉపాధ్యాయుడు, పిల్లలు కందూర్ పీఎస్‌లో చేరిక అడ్డాకుల : కందూర్ పంచాయతీ పరిధిలోని వడ్డెపల్లి ప్రాథమిక పాఠశాల మూత పడింది. ఈ ఏడాది బడిలో పిల్లలు తక్కువ సంఖ్యలో చేరడంతో విద్యాశాఖాధికారులు బడికి తాళం వేశారు. బడిలో చేరిన పిల్లలను కందూర్ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. వారితో పాటు ఇక్కడ పని చేసే ఉపాధ్యాయుడిని సైతం అదే బడికి పంపుతున్నారు. గతేడాది పదిమందిలోపే పిల్లలతో బడిని కొనసాగించారు. ఈ సారి పది మందిలోపు పిల్లలున్న పాఠశాలలను మూసి వేసి వాటిని పక్క గ్రామాల్లోని బడుల్లో చేర్పించాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది బడి ప్రారంభమైన తర్వాత కేవలం నలుగురు పిల్లలు మాత్రమే బడిలో చేరారు. బడిబాట సమయంలో తల్లిదండ్రులు తగినవిధంగా స్పందించలేదు. దాదాపు గ్రామంలో 20 మంది వరకు చదువుకునే పిల్లలున్నప్పటికీ తల్లిదండ్రులు వారిని ఇతర పాఠశాలలకు పంపుతున్నారు. ఈసారి బడిలో నలుగురే చేరడంతో ఇటీవల అధికారులు బడిని మూసి వేశారు. ఇక్కడున్న పిల్లలను కందూర్ పీఎస్‌లో చేర్పించారు. ఈ సారి పిల్లల సంఖ్య పెరగకుంటే బడి మూసి వేస్తారని ముందే ప్రచారం జరిగినా గ్రామస్తులు స్పందించక పోవడంతో నలుగురు పిల్లలతో బడిని కొనసాగించ లేక తాళం వేశారు. ‘తండా’కు తప్పిన ముప్పు..! కాటవరం తండా పాఠశాలలో గతేడాది తక్కువ మంది పిల్లలే ఉన్నారు. ఈసారి ఇక్కడ కూడా పిల్లల సంఖ్య పెరగకుంటే బడి కొనసాగడం కష్టమేనని అధికారులు ముందే హెచ్చరించారు. గతేడాది రెండు పాఠశాలల్లో తక్కువ మంది పిల్లలున్న కారణంతో ఈసారి వీటిని మూసి వేస్తారని ప్రచారం జరిగింది. ఈ ఏడాది వడ్డెపల్లిలో పిల్లలు లేక ఇటీవల బడి మూతపడింది. కాటవ రం తండాలో పిల్లలు బడిలో చేరకుంటే మూసి వేస్తారన్న విషయాన్ని గుర్తించిన గిరిజనులు మేల్కొన్నారు. ఈ ఏడాది బడిబాట సమయంలో ఉపా«ధ్యాయురాలితో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రైవేటు బడికి వెళ్లే కొందరు పిల్లలను స్థానిక సర్కారు బడిలో చేర్పించారు. ప్రస్తుతం 17 మంది పిల్లలను బడి కొనసాగుతోంది. తల్లిదండ్రులను చైతన్యం చేయాలి పిల్లల సంఖ్య తక్కువగా ఉందని బడిని మూసి వేశారు. బడులు తెరిచేటప్పుడు అధి కారులు ప్రత్యేక శ్రద్ధవహించి తల్లిదండ్రులను చైతన్యం చేసి పిల్లలను సర్కారు బడిలో చేర్పించుకోవాలి. – నాగిరెడ్డి, సర్పంచ్ కందూర్ ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే..! వడ్డెపల్లిలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో బడిని మూసి వేయాల్సి వచ్చి ంది. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకే పిల్లలు, ఉపాధ్యాయుడు కందూర్ పీఎస్‌కు వెళ్తున్నారు. కాటవరం తండాలో పిల్లల సంఖ్య పెరగడంతో అక్కడ బడి కొనసాగుతోంది. –నాగయ్య, ఎంఈఓ, అడ్డాకుల -
షారూఖ్ ను కలవాలని చిన్నారుల సాహసం
గయా: ఇంటి నుంచి పారిపోయి వచ్చిన నలుగురు బాలురను బిహారలోని గయా రైల్వే స్టేషన్ లో పోలీసులు కనుగొన్నారు. వీరిని చైల్డ్ లైన్ సంస్థ ప్రతినిధులకు అప్పగించారు. పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ జిల్లా నుంచి వీరు పారిపోయి వచ్చినట్టు గుర్తించారు. సమీర్ అన్సారీ(5), కైశిల్ అవాద్(9), ఆకిర్ అన్సారీ(4), అర్మాన్(5) శుక్రవారం సాయంత్రం ముంబై వెళ్లే రైలు ఎక్కారు. తమ అభిమాన హీరో షారూఖ్ ఖాన్‌ను కలిసేందుకు వీరు ముంబైకు బయలుదేరారు. శనివారం ఉదయం రైలు దిగి గయా రైల్వే స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వీరిని పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. షారూఖ్ ఖాన్ ను ఎందుకు కలవాలనుకున్నారని పోలీసులు ప్రశ్నించగా... అతడి డైలాగులు, డాన్స్ స్టెప్పులు, సినిమాల్లో పాటలు, అతడు నవ్వే స్టయిల్ బాగుంటుందని చిన్నారులు అమాయకంగా బదులిచ్చారు.