breaking news
four lane roads
-
Andhra Pradesh: కొత్తగా రెండు చోట్ల నాలుగు లేన్ల రహదారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో రెండు చోట్ల నాలుగు లేన్ల రహదారులు అందుబాటులోకి రానున్నాయి. కృష్ణా జిల్లాలోని పామర్రు–గుడివాడ, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి బైపాస్ రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. గతంలో రెండు లేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ఈ రహదారుల్లో ట్రాఫిక్రద్దీ పెరిగిన దృష్ట్యా నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఆమోదించింది. అందుకోసం త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో మార్పులు చేసి పనులు ప్రారంభించనుంది. చదవండి: (విషాదం: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. నేడు నవ్వుతూ ఇంట్లో ఉండేది) -
వనస్థలిపురం - రామచంద్రపురం నాలుగులేన్ల రోడ్లు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతానని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. పది వేల కోట్ల రూపాయల ఖర్చుతో వెయ్యి కిలోమీటర్ల మేర అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లను వేస్తామన్నారు. తూర్పు పడమరలను కలుపుతూ వనస్థలిపురం నుంచి రామచంద్రాపురం వరకు నాలుగు లేన్ల రోడ్లను వేస్తామని ఆయన చెప్పారు. అలాగే ఉత్తర దక్షిణాల మధ్య కూడా మరో కారిడార్ ఉంటుందన్నారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హైదరాబాద్ ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఆక్రమణలను తొలగించడం ద్వారా వర్షపు నీటి డ్రెయిన్లను పునరుద్ధరించి, రోడ్లు, కాలనీల్లో వరద సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం నగరంలో ఉన్న వీధిలైట్ల స్థానంలో నాలుగు లక్షల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటుచేస్తామన్నారు. ఫార్మాసిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, సినిమా సిటీల్లాంటి ప్రత్యేక క్లస్టర్లను, శాటిలైట్ టౌన్‌షిప్‌లను కలుపుతూ మరో ఔటర్ రింగ్‌రోడ్డును ఏర్పాటుచేయిస్తామని తెలిపారు. సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌తో పారిశ్రామిక వేత్తలకు అత్యంత అనుకూలమైన నగరంగా హైదరాబాద్‌ను తయారు చేస్తామని ఆయన చెప్పారు.