Andhra Pradesh: New Four Lane Roads In Two Places - Sakshi
Sakshi News home page

AP: కొత్తగా రెండు చోట్ల నాలుగు లేన్ల రహదారులు.. త్వరలోనే పనులు ప్రారంభం

Published Thu, Sep 8 2022 9:27 AM | Last Updated on Thu, Sep 8 2022 3:07 PM

Andhra Pradesh: New four Lane Roads in Two Places - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో రెండు చోట్ల నాలుగు లేన్ల రహదారులు అందుబాటులోకి రానున్నాయి. కృష్ణా జిల్లాలోని పామర్రు–గుడివాడ, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి బైపాస్‌ రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు.

గతంలో రెండు లేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ఈ రహదారుల్లో ట్రాఫిక్‌రద్దీ పెరిగిన దృష్ట్యా నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఆమోదించింది. అందుకోసం త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లో మార్పులు చేసి పనులు ప్రారంభించనుంది.   

చదవండి: (విషాదం: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. నేడు నవ్వుతూ ఇంట్లో ఉండేది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement