సికింద్రాబాద్లో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్: మినిస్టర్ రోడ్ లోని శ్రీసాయి కాంప్లెక్స్ లో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వరుసగా నాలుగు షాపులు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. షాపులన్నీ ఒకదానికొకటి అనుకుని ఉండటంతో మంటలు నాలుగు షాపులకు వ్యాపించాయి. దాంతో మంటల ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం.