నాలుగో పెళ్లికి హీరోయిన్ సిద్ధం.. హీరో షాక్..
హాలీవుడ్ భామ ఏంజెలీనా జోలి నాలుగో పెళ్లికి రెడీ అవుతోందనే వార్త హాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. భర్త బ్రాడ్ పిట్తో విడిపోయిన తర్వాత వ్యసనాలకు బానిసైన జోలీ.. మళ్లీ ప్రేమలో పడిందటా. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యాపారిని ఆమె నాలుగో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రముఖ మ్యాగజేన్ తన కథనంలో పేర్కొంది.
మ్యాగజేన్ కథనంలో ఇంకా ఏముందంటే.. జోలీ మాలిబు ఎస్టేట్‌లో ప్రియుడిని తరచూ కలుస్తున్నట్లు చెప్పింది. ఈ విషయం తెలిసిన బ్రాడ్ షాక్‌కు గురయ్యారని తెలిపింది. జోలీ వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం తనకు అసలు తెలియదని పిట్ తన సన్నిహితులతో వాపోయారని చెప్పింది.
తన పిల్లలతో కలిసి వేరే వ్యక్తి కలిసివుంటారనే ఊహే బాధగా ఉందని బ్రాడ్ అన్నారని తెలిపింది. జోలీ ఇష్టపడుతున్న వ్యక్తిని కలుసుకోవడం బ్రాడ్‌కు ఇష్టం లేదని చెప్పింది. అతన్ని తన కుటుంబాన్ని విడదీస్తున్న వ్యక్తిగా బ్రాడ్ భావిస్తున్నారని తెలిపింది. త్వరలో తాను ప్రేమిస్తున్న వ్యక్తిని పిల్లలకు పరిచయం చేయాలని జోలీ భావిస్తున్నట్లు వివరించింది.