Free Facility
-
చార్జీలు వసూలు చేయకండి
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల నుంచి రైళ్లలోగానీ, బస్సుల్లోగానీ చార్జీలు వసూలు చేయరాదని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వలస కార్మికుల ప్రయాణానికి వారి వంతు వచ్చే వరకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. రైల్వే స్టేషన్లలో రాష్ట్రాలు వలస కార్మికులకు ఆహారం, నీరు అందించాలనీ, రైళ్లలో రైల్వే శాఖ భోజనం, మంచినీరు సరఫరా చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వేలాది మంది వలస కార్మికులు అష్టకష్టాలు పడుతూ రోడ్లపై నడిచి వెళ్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం.. వలస కార్మికుల సమస్యను మే 26న సుమోటోగా స్వీకరించి, గురువారం విచారణ చేపట్టింది. కాలినడకన వెళుతోన్న వలస కార్మికులకు రవాణా సదుపాయాలను కల్పించాల్సిందిగా రాష్ట్రాలను కోరాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన సూచనలను కోర్టు గుర్తించింది. వలస కార్మికులు ఎందరున్నారు, వారి తరలింపు, వారి రిజిస్ట్రేషన్ విధానం తదితర పూర్తి సమాచారం రికార్డు చేయాలని సూచించింది. పేరు నమోదు చేసుకున్న తర్వాత వారిని ఎన్ని రోజులకు సొంత రాష్ట్రాలకు చేరుస్తామనే విషయంలో నిర్దిష్టత ఉండాలంది. తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటిదాకా 3,700 రైళ్లలో వలస కార్మికులను స్వరాష్ట్రాలకు చేర్చినట్టు సొలిసిటర్ జనరల్ మెహతా తెలిపారు. -
జాతీయ స్థాయి ఆటగాళ్లుగా ఎదగాలి
సాక్షి, బళ్లారి : గ్రామీణ స్థాయి నుంచి జాతీయ క్రికెట్ ఆటగాళ్లుగా ఎదిగేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని మాజీ జాతీయ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ అన్నారు. ఆయన సోమవారం నగరంలోని పోలీసు జింఖానాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం భారత క్రికెట్లో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో యువత ఆసక్తి కనబరిస్తే ఖచ్చితంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు వీలవుతుందన్నారు. కష్టపడితే ఏ రంగంలోనైనా రాణించవచ్చనేందుకు మన భారతీయులు ఎందరో ఉదాహరణగా నిలుస్తారని గుర్తు చేశారు. మహిళలు క్రికెట్ పోటీల్లో రాణించేందుకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. బాలికలను చిన్నప్పటి నుంచి క్రికెట్ పట్ల ప్రోత్సాహం అందిస్తే ముందుకు వెళతారన్నారు. ఉత్తర కర్ణాటకలో మహిళలు క్రికెట్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. అందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుందన్నారు. బాలికలకు చిన్నప్పటి నుంచి క్రికె ట్‌పై ప్రోత్సాహం అందిస్తే వారు కూడా జాతీయ స్థాయికి ఎదిగేందుకు వీలవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోను ప్రతిభావంత క్రీడాకారులను ప్రోత్సాహం అందించేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అండర్-14,16,19 ఏర్పాటు చేసి, రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళుతున్నామన్నారు. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు అన్ని రకాలుగా ఉచిత సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. కేఎస్‌సీఏ జిల్లా కో-ఆర్డినేటర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ బళ్లారి జిల్లా నుంచి అండర్-14,16,19ల నుంచి 11 మంది ఎంపిక కావడం ఎంతో సంతోషం కలుగుతోందన్నారు. యువత ముందుకు వస్తే క్రికె ట్లో రాణించేందుకు మంచి అవకాశాలు కల్పిస్తామన్నారు. వీరశైవ విద్యావర్ధక సంఘం క్రికె ట్‌కు ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ తదితరులు పాల్గొన్నారు.