Freecharge
-
యాక్సెస్ బ్యాంక్ చేతికి ఫ్రీచార్జ్ వాలెట్
-
ఫ్రీచార్జ్‌పై యాక్సిస్ బ్యాంక్ కన్ను
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌లో భాగమైన ఫ్రీచార్జ్‌ను ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ. 350–400 కోట్ల దాకా చెల్లించేలా స్నాప్‌డీల్‌తో ఒప్పందం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. డీల్ దాదాపు పూర్తయిపోయినట్లేనని, మరికొద్ది రోజుల్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ’కీలకమైన వ్యాపార ప్రకటన’ చేసేందుకు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించిన నేపథ్యంలో డీల్ వార్త మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 2015 ఏప్రిల్‌లో ఫ్రీచార్జ్‌ను స్నాప్‌డీల్ 400 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో దేశీ స్టార్టప్ సంస్థలకు సంబంధించి ఇది అతిపెద్ద డీల్‌గా నిల్చింది. ఫ్రీచార్జ్ కొనుగోలుతో దీని 5 కోట్ల మంది మొబైల్ వాలెట్ యూజర్లు యాక్సిస్‌కు చేరువ కాగలరు. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌కు స్నాప్‌డీల్ ఓకే? తమ సంస్థ కొనుగోలు కోసం ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసిన 900–950 మిలియన్ డాలర్ల డీల్‌కు స్నాప్‌డీల్ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఇక స్నాప్‌డీల్‌లోని మిగతా వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు వివరించాయి. శుక్రవారం జరిగే బోర్డు సమావేశంలో షేర్ల మార్పిడి నిష్పత్తిని ఫ్లిప్‌కార్ట్ ఖరారు చేయొచ్చు. విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంక్‌కు 20% వాటాలు దక్కే అవకాశముంది. ప్రారంభ దశలో స్నాప్‌డీల్ బ్రాండ్ పేరును ఫ్లిప్‌కార్ట్ అలాగే కొనసాగించవచ్చని తెలుస్తోంది. స్నాప్‌డీల్ కొనుగోలుకు తొలుత బిలియన్ డాలర్లు ఇవ్వజూపిన ఫ్లిప్‌కార్ట్.. ఆ తర్వాత వ్యాపార కార్యకలాపాల మదింపు అనంతరం 550 మిలియన్ డాలర్లకు కుదించి.. మళ్లీ తాజాగా 900–950 మిలియన్ డాలర్లకు పెంచింది. -
సాప్ట్ బ్యాంకుతో పేటీఎం భారీ డీల్
-
సాప్ట్ బ్యాంకుతో పేటీఎం భారీ డీల్
న్యూఢిల్లీ : దేశీయ ఈ-కామర్స్ రంగంలో దూసుకెళ్తున్న పేటీఎంలోకి భారీగా పెట్టుబడులు రానున్నట్టు తెలుస్తోంది. జపాన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సాఫ్ట్‌బ్యాంకు పేటీఎంలో 1.2 బిలియన్ డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు 7,750 కోట్ల రూపాయల నుంచి 9687 కోట్లు రూపాయల వరకు ఉండొచ్చు. వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడిచే ఈ ఫిన్‌టెక్ స్టార్టప్ పేటీఎం, ఈ డీల్ విషయంలో జపాన్ సంస్థతో సంప్రదింపులు జరిపినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. మూడు నెలలుగా జరుగుతున్న ఈ సంప్రదింపుల్లో ప్రస్తుత పేటీఎం ఇన్వెస్టర్ సైఫ్ పార్టనర్స్, వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు చెందిన కొన్ని షేర్లను సాప్ట్ బ్యాంకు కొనుగోలుచేస్తోంది. అదేవిధంగా కంపెనీల్లోనూ నగదు రూపంలో పెట్టుబడులు పెట్టనుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. సాఫ్ట్‌బ్యాంకు ప్రతిపాదిత పెట్టుబడులు పెట్టినట్లయితే 5 బిలియన్ డాలర్ల (రూ.32,293కోట్లకు పైగా) విలువ ఉండే పేటీఎం విలువ 7 బిలియన్ల డాలర్ల(రూ.45,216 కోట్లకు)కు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మొబైల్ వ్యాలెట్, ఈ-కామర్స్ సర్వీసుల్లో దూసుకెళ్లున్న పేటీఎం తాజాగా పెట్టుబడులతో పేటీఎం బ్యాంకు సర్వీసుల విస్తరణను మరింత వేగవంతం చేసుకోబోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పేటీఎం సాఫ్ట్ బ్యాంక్ సంస్థ లావాదేవీల్లో భాగంగా స్నాప్‌డీల్ సొంతమైన చెల్లింపులు సంస్థ ఫ్రీచార్జ్ కొనుగోలు చేయవచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. సాఫ్ట్‌బ్యాంకు కంపెనీ ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలైన ఫ్లిప్‌కార్డు, అమెజాన్ ఇండియాలకు పోటీగా భారత మార్కెట్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
ఫ్రీ చార్జ్ సీఈవో ఈయనే
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజం స్నాప్ డీల్ అనుబంధ సంస్థ ప్రీ చార్జ్ సీఈవో నియామకాన్ని చేపట్టింది. మాజీ రియల్ ఎస్టేట్ పోర్టల్ హౌసింగ్ .కామ్ ఎగ్జిక్యూటివ్ జాసన్ కొఠారి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇటీవల ఈ పదవికి గోవింద్ రాజన్ రాజీనామా చేయడంతో కంపెనీ ఈ నియామకాన్ని చేపట్టింది. జాసన్‌ను సీఈవోగా ఎంపిక చేయడం ఆనందంగాఉందని స్పాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ బాల్ తెలిపారు. ఆయన ఒక బలమైన వ్యూహాత్మక మరియు బహుముఖ వ్యాపార నాయకుడని, ఇప్పటికే రెండు విజయవంతమైన సంస్థలకు సీఈవోగా, వ్యాపారవేత్తగా ఉన్నారని కొనియాడారు. సంస్థలో మరో 20 మిలియన్ డాలర్లు పెట్టేందుకు యోచిస్తున్నట్టు స్నాప్‌డీల్ ప్రకటించింది. మరోవైపు భారతదేశ డిజిటల్ చెల్లింపుల విప్లవం లో ఫ్రీఛార్జ్ సంస్థ ఒక కీలక పాత్ర పోషించనుందని కొఠారి అంచనా వేశారు. డిజిటల్ పరిశ్రమ 2025 నాటికి 1 ట్రిలియన్ డాలర్లను సాధిస్తుందని తెలిపారు. కాగా 2015 ఆగష్టులో ప్రీ చార్జ్ సీఈఓగా గోవిందరాజన్ బాధ్యతలను స్వీకరించారు. దాదాపుగా ఏడాదిన్నర పాటు ఆయన విశేష సేవలను అందించారు. ప్రధాన ప్రత్యర్థి అమెజాన్ నుంచి గట్టిపోటీతోపాటు సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులను ఉపసంహరించు కోవడం ఫ్రీచార్జ్ ఇబ్బందుల్లో పడింది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా పెట్టుబడుల కొరత తీవ్రత కారణంగా 2016 మార్చి నాటికి రూ. 235 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. అయితే ఈ ఏడాది జనవరిలో గోవింద రాజన్ రాజీనామా చేయడంతొ ఆయన స్థానంలో నూతన సిఈఓగా జాసన్ కొఠారిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
స్నాప్‌డీల్ చేతికి ఫ్రీచార్జ్
ఈ కామర్స్‌లో అతి పెద్ద డీల్ స్నాప్‌డీల్ నుంచి ఇక మొబైల్ రీచార్జ్‌లు, ఆర్థిక సేవలు బెంగళూరు: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్, మొబైల్ లావాదేవీల ప్లాట్‌ఫామ్ ఫ్రీచార్జ్‌ను కొనుగోలు చేసింది. నగదు, స్టాక్ డీల్‌తో ఫ్రీచార్జ్‌ను కొనుగోలు చేశామని, భారత డిజిటల్ కామర్స్ రంగంలో ఇదే అతి పెద్ద కొనుగోలు అని స్నాప్‌డీల్ పేర్కొంది. అయితే ఫ్రీచార్జ్‌ను ఎంతకు కొనుగోలు చేసిందీ స్నాప్‌డీల్ వెల్లడించలేదు. గతంలో ఫ్లిప్‌కార్ట్ సంస్థ మైంత్రను రూ.2,000 కోట్లకు కొనుగోలు చేసింది. భారత ఇంటర్నెట్ పరిశ్రమలో ఇదే ఇప్పటివరకూ అతి పెద్ద డీల్‌గా చెబుతారు. ఫ్రీచార్జ్ మొబైల్ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు మొబైల్ బిల్లులు, డీటీహెచ్ రీచార్జ్, ఇతర లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఫ్రీచార్జ్ కొనుగోలుతో తమ వినియోగదారుల సంఖ్య మరింతగా పెరిగిందని స్నాప్‌డీల్ సీఈఓ కునాల్ బహాల్ చెప్పారు. ఈ కొనుగోలు కారణంగా తమ సేవల పరిధి మరింతగా విస్తృతమవుతుందని, ఆర్థిక సేవలతో పాటు, మొబైల్ రీచార్జ్ కూడా అందిస్తామని పేర్కొన్నారు. తాము కొనుగోలు చేసినప్పటికీ, ఫ్రీచార్జ్ స్వతంత్ర ప్లాట్‌ఫామ్‌గానే కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్రీచార్జ్‌లో 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరంతా కొనసాగుతారని వివరించారు. స్నాప్‌డీల్‌తో భాగస్వామ్యం సరైన సమయంలో కుదిరిందని, మరింత మందికి చేరువకాలగమని ఫ్రీచార్జ్ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈఓ కూడా అయిన కునాల్ షా పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీని తట్టుకోవడానికి స్నాప్‌డీల్ సంస్థ తగిన ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే గత వారం ఈ సంస్థ డిజిటల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌ల ప్లాట్‌ఫామ్ రూపీపవర్ను కొనుగోలు చేసింది. లాజిస్టిక్స్ సంస్థ గోజావాస్ను చేజిక్కించుకుంది. మరిన్ని కొనుగోళ్లకు సిద్ధంగా ఉంది.