‘స్వచ్ఛ భారత్’ తపాలా బిళ్ల ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమానికి సంబంధించిన తపాలా బిళ్లను కమ్యూనికేషన్ అండ్ ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్‌లు శుక్రవారమిక్కడ ఆవిష్కరించారు. స్మార్ట్ సిటీలపై రాష్ట్రాలు, స్టాక్‌హోల్డర్లతో జరిగిన వర్క్‌షాపులో మంత్రులు ‘స్వచ్ఛ భారత్’ పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ‘స్టాంపుల తయారీలో ప్రజలు పాల్గొన్నారు. వీటిని పిల్లలు తయారు చేయడం ఇంకా ప్రత్యేకం. 9వేల డిజైన్లు మాకు పంపారు. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని అవకాశమున్న అన్ని మార్గాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఈ ఆలోచన చేశాం’ అని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. క్లీన్ ఇండియా లేనిదే డిజిటల్ ఇండియా సాధ్యం కాదన్నారు. స్మార్ట్ సిటీల ముఖ్యోద్దేశం ‘క్లీన్ సిటీ’ అని వెంకయ్యనాయుడు అన్నారు.