OTT: ‘ఫ్రీలాన్స్’ హాలీవుడ్ మూవీ రివ్యూ
యాక్షన్ సినిమా అంటే పూర్తిగా యాక్షనే కాదు కామెడీతో కూడిన యాక్షన్ చిత్రాలు ఇదివరలో మనం చాలానే చూశాం. అదే కోవలో విడుదలైన చిత్రం ఫ్రీలాన్స్ ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతోంది. జాన్ సేనా వంటి సీరియస్ యాక్షన్ కథానాయకుడు నటించిన చిత్రం ఈ ఫ్రీలాన్స్. కథాపరంగా కథానాయకుడు ఒకప్పుడు ఆర్మీలో పని చేసి ఓ వ్యక్తి చేసిన తప్పిదానికి ఆర్మీ నుండి అనుకోకుండా తను సస్పెండ్ అవుతాడు.కొంతకాలం తరువాత తన స్నేహితుడి ద్వారా ప్రైవేట్ ఆర్మీలో పని చేసే అవకాశం లభిస్తుంది కథానాయకుడికి. ఆ ప్రైవేట్ ఆర్మీ మొదటి ఆపరేషన్ ఓ జర్నలిస్టుకి బాడీగార్డ్ గా వ్యవహరించడం. ఆ జర్నలిస్ట్ ఓ దేశాధిపతిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళే తరుణంలో కథానాయకుడిని బాడీగార్డ్ గా తీసుకువెళుతుంది. అక్కడ ఆదేశాధిపతి మీద దాడి జరుగుతుంది. తరువాత ఆ దాడిని కథానాయకుడు ఎలా ఎదుర్కున్నాడు, జర్నలిస్ట్ ను ఎలా రక్షించాడు అన్నది ఓటిటి తెర మీద చూడాల్సిందే. ఈ కథ కాన్సెప్ట్ సీరియస్ అయినా స్క్రీన్ ప్లే మాత్రం హాస్యభరితంగా ఉంటుంది. వీకెండ్ మూవీ వ్యూవర్స్ కు మస్ట్ వాచ్ మూవీ అని చెప్పవచ్చు.- ఇంటూరు హరికృష్ణ