french forces
-
ముగిసిన మాలి ఆపరేషన్
మాలి: మాలి రాజధాని బొమాకోలో ఉగ్రవాదుల వేట ముగిసింది. బొమాకోలోని హోటల్లోకి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులను మాలి సైన్యం మట్టుబెట్టింది. అమెరికా, ఫ్రాన్స్ సైన్యం కూడా వారికి తోడుకావడంతో ఉగ్రవాదుల ఆటకట్టించడం కాస్త తేలికైంది. అయితే, ఈ ఆపరేషన్ మాత్రం కాస్త విషాదాన్ని మిగిల్చింది. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న 18 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 20 మంది భారతీయులు మాత్రం క్షేమంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. హోటల్ లో మరెవరూ బందీలుగా లేరని మాలి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో దాదాపు 24గంటల తర్వాత ఈ ఆపరేషన్ ముగిసినట్లయింది. -
మాలికి అండగా ఫ్రాన్స్ బలగాలు
ఉగ్రవాదంతో ఇటీవల తీవ్రంగా ప్రభావితమైన ఫ్రాన్స్....మాలిలో ఉగ్రవాదుల దాడిపై వేగంగా స్పందించింది. ఉగ్రవాదులను ఏరివేయటంలో మాలి సైన్యానికి బాసటగా నిలిచేందుకు తమ సైన్యాన్ని రంగంలోకి దింపింది. పారిస్ దాడుల నేపథ్యంలో ఉగ్రవాదాన్ని ప్రపంచదేశాలన్నీ కలిసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చిన ఫ్రాన్స్ ఆ దిశగా సాయం అందించింది. పశ్చిమ ఆఫ్రికా దేశం మాలీ రాజధాని బమాకాలోని ఓ హోటల్‌పై ఉగ్రవాదులు శుక్రవారం దాడికి పాల్పడి 170 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఆయుధాలతో రాడిసన్ హోటల్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాధితులను విడిపించడానికి ఇప్పటికే మాలిలోని భద్రతా బలగాలు ఉగ్రవాదులతో పోరాడుతుండగా వారికి ఫ్రాన్స్ బలగాలు సహకారం అందించడానికి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భద్రతా దళాలు ఇప్పటికే 80 మంది బందీలకు విముక్తిని కల్పించగా మిగతా వారికోసం పోరాడుతున్నారు. ఉగ్రవాదులు ఇప్పటికే పలువురు బందీలను హతమార్చినట్లు తెలుస్తోంది.