French Open mixed doubles
-
‘మిక్స్డ్’ ఫైనల్లో బోపన్న జంట
పారిస్: భారత్ తరఫున గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్ గెలిచిన నాలుగో ప్లేయర్‌గా గుర్తింపు పొందేందుకు రోహన్ బోపన్న మరో విజయం దూరంలో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తన భాగస్వామి గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా)తో కలసి బోపన్న ఫైనల్లోకి అడుగు పెట్టాడు. సెమీఫైనల్లో ఏడో సీడ్ బోపన్న–దబ్రౌస్కీ జంట 7–5, 6–3తో మూడో సీడ్ హలవకోవా (చెక్ రిపబ్లిక్)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. గురువారం జరిగే ఫైనల్లో అనాలెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ)–రాబర్ట్ ఫరా (కొలంబియా) జంటతో బోపన్న–దబ్రౌస్కీ ద్వయం తలపడుతుంది. 2010 యూఎస్ ఓపెన్‌లో ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్)తో కలసి బోపన్న పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచాడు. గతంలో భారత్ తరఫున లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా మాత్రమే గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలిచారు. నేటి మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ.గం. 3.25 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
సానియా x పేస్
మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో అమీతుమీ ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో సానియా మీర్జా, లియాండర్ పేస్ జోడీలు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. గురువారం జరిగిన సెమీస్‌లో రెండోసీడ్ సానియా-డుడిగ్ (క్రొయేషియా) 4-6, 6-3, 12-10తో మూడోసీడ్ ఫ్రాన్స్ ద్వయం మాల్డొనోవిచ్-హెర్బర్ట్లపై విజయం సాధించగా... పేస్-హింగిస్ (స్విట్జర్లాండ్) 6-3, 3-6, 10-7తో ఆరోసీడ్ హల్వకోవా (చెక్)-వాసెలిన్ (ఫ్రాన్స్)లపై నెగ్గారు.