
సానియా x పేస్
మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో అమీతుమీ
ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా, లియాండర్ పేస్ జోడీలు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. గురువారం జరిగిన సెమీస్‌లో రెండోసీడ్ సానియా-డుడిగ్ (క్రొయేషియా) 4-6, 6-3, 12-10తో మూడోసీడ్ ఫ్రాన్స్ ద్వయం మాల్డొనోవిచ్-హెర్బర్ట్‌లపై విజయం సాధించగా... పేస్-హింగిస్ (స్విట్జర్లాండ్) 6-3, 3-6, 10-7తో ఆరోసీడ్ హల్వకోవా (చెక్)-వాసెలిన్ (ఫ్రాన్స్)లపై నెగ్గారు.