సానియా, పేస్, బోపన్నలు శుభారంభం | Sania Mirza, Leander Paes, Rohan Bopanna Progress With Respective Partners | Sakshi
Sakshi News home page

సానియా, పేస్, బోపన్నలు శుభారంభం

Published Thu, Sep 1 2016 1:21 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

సానియా, పేస్, బోపన్నలు శుభారంభం

సానియా, పేస్, బోపన్నలు శుభారంభం

న్యూయార్క్:యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో భారత టెన్నిస్ ఆటగాళ్లు శుభారంభం చేశారు. తొలి రౌండ్ లో భాగంగా మహిళల డబుల్స్లో సానియా మీర్జా-బార్బోరా స్టికోవా( చెక్ రిపబ్లిక్) జోడితో పాటు,  మిక్స్డ్ డబుల్స్లో లియాండర్ పేస్- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) ద్వయం తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించగా,  పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న-ఫ్రెడిక్ నీల్సన్(డెన్మార్)  జంట విజయం సాధించింది.


మిక్స్డ్ డబుల్స్లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన పేస్-హింగిస్ల ద్వయం 6-3, 6-2 తేడాతో సాచియా వికెరీ(అమెరికా)-తైఫో(ఫ్రాన్స్)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. 51 నిమిషాల పాటు జరిగిన పోరులో పేస్ హింగిస్లు వరుస సెట్లను కైవసం చేసుకున్నారు. మహిళల డబుల్స్లో సానియా-స్టికోవా జోడి 6-3, 6-2 తేడాతో అమెరికా జంట జదా మయీ-ఎనా షిబాహరాపై గెలిచింది. ఇక పురుషుల డబుల్స్లో బోపన్న- నీల్సన్ జంట 6-3, 6-7(3), 6-3 తేడాతో పదహారో సీడ్ రాడెక్ స్టెపనాక్(చెక్ రిపబ్లిక్)- నెనాడ్ జిమోంజిక్(సెర్బియా)పై విజయం సాధించి రెండో రౌండ్లోకి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement