చెరువులకు జలాల తరలింపులో ఘర్షణ
∙కాల్వకు రేకులను అడ్డంగా పెట్టిన నాగపురి గ్రామస్తులు
∙వాటిని తొలగించేందుకు యత్నించిన పోతిరెడ్డిపల్లివాసులు
చేర్యాల : తపాస్పల్లి రిజర్వాయర్ నుంచిlపోతిరెడ్డిపల్లిలోని బయ్యన్న చెరువులోకి గోదావరి జలాలను తరలిస్తుండగా, నల్లపోచమ్మ సమీపంలో ఉన్న దేవాదుల కాల్వలోకి నీళ్లు చేరకుండా నాగపురి గ్రా మస్తులు రేకులను అడ్డుపెట్టారు. దీంతో పోతిరెడ్డిపల్లి, నాగపురి గ్రామస్తుల మధ్య ఆదివారం ఘర్షణ చోటుచేసుకుంది. పోతిరెడ్డిపల్లివాసులు కాల్వ వద్దకు చేరుకొని రేకులను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన గొడవలో పోతిరెడ్డిపల్లికి చెందిన పెంబర్ల కనకయ్య, పెంబర్ల బాగయ్య, గూడురు బాలరాజు, పెంబర్ల యాదగిరి, పోరెడ్డి రమేశ్ గాయపడ్డారు. నాగపురికి చెందిన పలువురు పోతిరెడ్డిపల్లి గ్రామస్తులకు చెందిన బైక్ల గాలి తీయడం కూడా ఘర్షణకు ఓ కారణంగా పేర్కొంటున్నారు. దీనిపై బాధితులు చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.