fruit venders
-
ఆవును కత్తితో పొడిచి చంపిన పండ్ల వ్యాపారి
ముంబై : పండు తిన్నదన్న కారణంతో ఓ వ్యక్తి ఆవును చంపిన దారణ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తౌఫిక్ బషీర్ ముజావర్ అనే వ్యక్తి రాయ్‌గడ్‌లోని మురుద్ ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. అయితే తన దుకాణం నుంచి ఆవు బొప్పాయి పండును దొంగలించి తిన్నదన్న కోపంతో ఆవుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆవు పొత్తి కడుపులో కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. దీన్ని గమనించిన ఓ బాటసారి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఆవును వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆవు చనిపోయింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై జంతు నిరోధక చట్టం కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై హిందుత్వ సంఘాలు, పలువురు బీజేపీ నాయకులు మండిపడుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చదవండి : ( రేండేళ్లుగా ప్రియురాలపై అత్యాచారం: ప్రియుడి అరెస్టు) (ప్రియుడి దొంగతనం.. ప్రేమికుల అరెస్టు) -
'ఉగ్రవాదుల కంటే పండ్ల వ్యాపారులే డేంజర్'
-
'ఉగ్రవాదుల కంటే పండ్ల వ్యాపారులే డేంజర్'
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల కాయలు త్వరగా పక్వానికి వచ్చేందుకు, ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తున్న పండ్ల వ్యాపారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్బైడ్ ఉపయోగిస్తున్న వ్యాపారులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదులు నేరుగా వచ్చి చంపుతారని, కార్బైడ్ వాడే వ్యాపారులు పండ్ల ద్వారా విషాన్ని శరీరాల్లోకి చొప్పిస్తున్నారని మండిపడింది. ఈ వ్యవహారంలో కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా వ్యవహరించాలని న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డిని కోరింది. కార్బైడ్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, నాడీ వ్యవస్థపై ప్రభావం తదితర వివరాలను తమ ముందుంచాలని నిరంజన్‌రెడ్డికి ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే గత వారం పండ్ల మార్కెట్ తనిఖీలకు తామిచ్చిన ఆదేశాలను ఎప్పుడు అందుకున్నారు.. ఏ సమయంలో తనిఖీలు చేశారు.. తదితర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.