funds cut
-
డబ్ల్యూహెచ్ఓకి అమెరికా నిధులు కట్
వాషింగ్టన్: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారిపై అప్రమత్తం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విఫలమైందని ఆరోపణలు గుప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. డబ్ల్యూహెచ్ఓకి నిధుల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతీ ఏడాది అమెరికా 50 కోట్ల డాలర్ల నిధుల్ని డబ్ల్యూహెచ్ఓకి కేటాయిస్తుంది. ఆ సంస్థ చైనాకి కొమ్ముకాస్తూ ప్రపంచదేశాలను ముప్పులో పడేసిందని ట్రంప్ ఆరోపించారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థకి విడుదల చేసే నిధుల్ని వెంటనే ఆపేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నాను’ అని ట్రంప్ వెల్లడించారు. ‘వూహాన్లో వైరాలజీ ల్యాబ్ ఉంది. అక్కడే మాంసం, చేపల మార్కెట్లు ఉన్నాయి. వైరస్ అక్కడే పుట్టింది’ అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో అన్నారు. కోవిడ్ సంక్షోభంలో చిక్కుకొని ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకి వచ్చే నిధుల్ని నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్‌పై పోరాటంలో చురుకైన పాత్ర పోషిస్తున్న డబ్ల్యూహెచ్ఓకి ఇలాంటి సమయంలో నిధుల్ని ఆపేయడం సరైంది కాదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరాస్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధుల్ని ఆపేస్తే దాని ప్రభావం అందరి మీద పడుతుందన్నారు. ప్రపంచదేశాలన్నీ ఐక్యమత్యంగా ఉంటూ రాబోయే విపత్తును ఎదుర్కోవాల్సిన తరుణంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని అన్నారు. నిధులు పెంచుతాం : చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకి అమెరికా నిధుల్ని నిలిపివేయడంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సమయంలో నిధుల్ని ఆపేస్తే, ఆ దేశంతో సహా అందరిపైనా ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. తాము ఇకపై నిధులు పెంచుతామంటూ సంకేతాలు ఇచ్చింది. ఇప్పటికే 2 కోట్ల డాలర్లు ఇచ్చామని వెల్లడించింది. -
సైనికుల యూనిఫాం నిధుల్లో కోత
సాక్షి, న్యూఢిల్లీ : సైనికుల యూనిఫాంకు కేటాయించే నిధుల్లో కోత విధించడం పట్ల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మంగళారం బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియా అంటూ నినాదాలిచ్చే ప్రభుత్వం మన సైనికుల దుస్తులు, షూలను వారే కొనుగోలు చేసేలా చేస్తోందని ఎకనమిక్ టైమ్స్‌లో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. నిధుల్లో కేంద్రం కోత విధించడంతో భారత సైన్యం ఫ్యాక్టరీల నుంచి సైనికుల దుస్తుల సరఫరాలను గణనీయంగా తగ్గించిందని ఈ కథనం పేర్కొంది. నిధుల కేటాయింపులో కేంద్రం విఫలమవడంతో సైనికులు ప్రస్తుతం తమ యూనిఫాం, ఇతర నిత్యావసరాలను స్ధానిక మార్కెట్లలో తమ సొంత డబ్బు వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆ కథనం వెల్లడించింది. దీనిపై ఇప్పటివరకూ కేంద్రం, భారత ఆర్మీ స్పందించలేదు. 2014లో నరేంద్ర మోదీ నేతృతంలో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరినప్పటి నుంచి మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే క్రమంగా మేకిన్ ఇండియా నిర్వీర్యమవుతోందని విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నక్రమంలో సైన్యం తాజా ఉత్తర్వులు కేంద్రానికి ఇబ్బందికరంగా పరిణమించాయి. -
‘అభియాన్’కు నిధుల కోత?
ప్రాథమిక విద్యను బలోపేతం చేసి, జవజీ వాలు కల్పించేందుకై ఉద్దేశించిన సర్వశిక్ష అభి యాన్ (ఎస్ఎస్ఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నిధుల కోతను అమలు చేయనుంది. ఇంతవరకు ఈ నిధులను 65:35 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రాలు భరిస్తూ వస్తున్నాయి. అయి తే తాజాగా ఈ నిష్పత్తిని 50:50గా మార్చేం దుకు కేంద్ర మానవ వనరుల శాఖ ప్రణాళి కను రూపొందించడంపై విద్యాభిమానులు పెదవి విరుస్తున్నారు. కేంద్రం వైఖరి ఫలితం గా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన వంటి సౌకర్యాలకు గండి పడే ప్రమాదం పొంచి ఉం ది. ఉపాధ్యాయ నియామకాల భర్తీ ఎండమా విగా మారవచ్చు. నిరుద్యోగుల పాలిట శాపం గా పరిణమించడం ఖాయమని స్పష్టమవు తోంది. ఇప్పటికే సర్కారీ విద్యా రంగం పరి స్థితి అగమ్యగోచరంగా ఉంది. విభజనలో చిక్కి శల్యమైన ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో బక్కచిక్కిన రాష్ట్రాలు అదనంగా 15 శాతం నిధులను భరించడం సాధ్యమేనా అనే ప్రశ్న ఎదురవుతుంది. సర్వశిక్ష అభియాన్ పథ కానికి నిధుల కోతపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర వైఖరిని సూటిగా ప్రశ్నించాలి. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే విద్యావ్యవస్థ మరింత పతనం కావడం ఖాయం. నిధుల కోత వల్ల కార్పొరేట్ శక్తులు మరింత బలపడతాయి. బడు గు, బలహీనవర్గాల పిల్లలు అన్ని విధాల నష్ట పోతారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కేంద్ర పెత్తనాన్ని ప్రశ్నించాలి. రాష్ట్రా నికి న్యాయం జరిగేలా చూడాలి. లేకపోతే పాలకులు భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి ఉంటుంది. - వి.కొండలరావు పొందూరు, శ్రీకాకుళం జిల్లా మొబైల్: 9490528730 -
ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఈ ఏడాది రూ. 5,751 కోట్లు నష్టపోయాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, ఉదారంగా ఆర్థికసాయం చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బడ్జెట్లో నిధుల కోత, పెండింగ్ బకాయిల కారణంగా రాష్ట్రం ఈ ఏడాది రూ.5,751 కోట్లను నష్టపోయిందని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా రాష్ట్రానికి ఆంక్షలు లేని నిధులు మంజూరు చేయాలని కోరుతూ గురువారం కేంద్రానికి లేఖ రాసింది. రెండు రోజుల కింద కింద ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ లేఖను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందించారు. కేంద్రం పన్నుల వాటాలో తెలంగాణకు పంపిణీ చేసే శాతాన్ని 2.89 నుంచి 2.43 శాతానికి తగ్గించిందని.. దీంతో రాబోయే ఐదేళ్లలో రాష్ట్రం దాదాపు రూ.16 వేల కోట్లు నష్టపోతుందని పేర్కొన్నారు. అందులో ఈ ఒక్క ఏడాదిలోనే రూ.2,389 కోట్లు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం దేశంలో ఏడు రాష్ట్రాలు రూ.10,135 కోట్ల నుంచి రూ.27,690 కోట్లను వాటాగా పొందగా... కొత్త రాష్ట్రమైన తెలంగాణకు మాత్రం పన్నుల ఆదాయంలో వాటాను తగ్గించారు. మరోవైపు రాష్ట్రాలకు పన్నుల వాటాను పదిశాతం పెంచిన సాకుతో కేంద్రం ప్రాయోజిత పథకాల నిధులకు భారీగా కత్తెర వేసింది. ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలోనే తెలంగాణకు రూ.2,233 కోట్లు కోత పడింది. దీంతో రాష్ట్రం ఆర్థికంగా సమస్యల్లో చిక్కుకుంది. మొత్తంగా పన్నుల వాటా, పథకాల నిధులు వెరసి కేంద్రం నుంచి రావాల్సిన రూ.4,622 కోట్లు నిలిచిపోయాయి. ఇదేగాకుండా దాదాపు 20 కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన నిధులు కూడా బాగా పెరిగిపోయాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక ప్యాకేజీని అందించాలని ఆర్థిక శాఖ కేంద్రానికి రాసిన లేఖలో వివరించింది. స్థానిక సంస్థలకు నిధులివ్వండి.. మౌలిక వసతుల కల్పనకు ఖర్చు చేసే 13వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి విడుదల కాకపోవడంతో రాష్ట్రంలోని స్థానిక సంస్థలు నిధుల సంక్షోభంలో కూరుకుపోయాయని పేర్కొంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రానికి మరో లేఖ రాసింది. రాజ్యాంగబద్ధమైన ఈ గ్రాంట్లను వెంటనే విడుదల చేయాలని అభ్యర్థించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలకు రూ.778.72 కోట్లు రావాల్సి ఉందని ఈ లేఖలో ప్రస్తావించింది. మొత్తంగా 13వ ఆర్థిక సంఘం బకాయిలు రూ.1,129.93 కోట్లుగా ఉన్నాయని.. ఇప్పటికే చేపట్టిన పనులకు అవసరమైన బిల్లుల చెల్లింపునకు వీలుగా ఈ నిధులు విడుదల చేయాలని పేర్కొంది.