ఫార్మా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
కనగల్ : పార్మా రంగంలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నందున ఫార్మా విద్యర్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ గోవింద్ సింగ్ అన్నారు. బుధవారం కనగల్ మండలం చర్లగౌరారం పరిధిలోని ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న బీ ఫార్మసి విద్యార్థులకు ఓరియంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఫార్మాసిటిని స్థాపించడంతో ఎక్కువ కంపెనీలు నెలకొల్పే అవకాశం ఉన్నందున ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయన్నారు. దేశ విదేశాల్లోనూ పార్మా రంగానికి అధిక ప్రాధాన్యం ఉందన్నారు. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఫార్మసీ విద్యను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం డ్రగ్ ఇన్స్పెక్టర్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మూల దయాకర్‌రెడ్డి, ఫార్మా కశాశాల ప్రిన్సిపాల్ ఎం. నాగులు, ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీ ప్రిన్సిపాల్ హరినాథరెడ్డి, అధ్యాపకులు షబ్బిర్, పోలిరెడ్డి, గోపాల్‌రెడ్డి, పీఆర్ఓ రాజారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.