పవన విద్యుత్‌లోకి హీరో గ్రూప్
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుదుత్పత్తి రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ద్విచక్ర వాహన దిగ్గజం హీరో గ్రూప్ ప్రకటించింది. ఇందుకు హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్ పేరుతో కొత్త కంపెనీను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. ప్రణాళికలకు అనుగుణంగా 2016-17కల్లా రూ. 7,000 కోట్లను ఇన్వెస్ట్‌చేయనున్నట్లు కంపెనీ ఎండీ రాహుల్ ముంజాల్ చెప్పారు. తద్వారా పర్యావరణ అనుకూల ఇంధన ప్రాజెక్ట్‌లను చేపట్టనున్నట్లు వెల్లడించారు.
దీనిలో భాగంగా ఒక గిగావాట్ లేదా 1,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేసినట్లు తెలిపారు. కాగా, ఒక్కో మెగా వాట్ పవన విద్యుత్ ఉత్పత్తికి రూ.7 కోట్లు, సౌర విద్యుత్‌కు రూ. 8 కోట్లు చొప్పున పెట్టుబడులు అవసరమని కొత్త యూనిట్ ప్రారంభం సందర్భంగా రాహుల్ వివరించారు. ద్విచక్ర వాహన దిగ్గజం హీరో గ్రూప్‌నకు పూర్తి అనుబంధ కంపెనీగా వ్యవహరిస్తున్న ఫ్యూచర్స్ ఎనర్జీస్ రాజస్థాన్‌లో 37.5 మెగావాట్ల పవన విద్యుత్ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.