రేపు ప్రైవేట్ విద్యాసంస్థల బంద్
కర్నూలు(విద్య): అధిక ఫీజుల నియంత్రణ కోరుతూ ఈ నెల 20న జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీనివాసులు, జి.చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం స్థానిక సీఆర్ భవన్లో ఏఐఎస్ఎఫ్ నగర కార్యవర్గ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను తుం గలో తొక్కి ధనార్జనే ద్యేయంగా విద్యార్థుల నుంచి ముక్కు పిండి వేలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నారని విమర్శించారు.
పుస్తకాలు, పరీక్ష ఫీజులు, స్టేషనరీ, స్పోర్ట్స్, వెల్కమ్ పార్టీ, ఫేర్వెల్ పార్టీల పేర్లతో దోపిడీ చేస్తున్నారన్నారు. వీటికి వ్యతిరేకంగా ఈ నెల 20న చేపట్టనున్న బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. విద్యార్థినీ విద్యార్థులతో పా టు తల్లిదండ్రులు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నగ ర కార్యదర్శి ఎం.మనోహర్, నాయకులు రాజశేఖర్, హరికృష్ణ, రాజు, మధు తదితరులు పాల్గొన్నారు.