గోదావరి జలాల వినియోగంపై అధ్యయనం
నిట్ డైరెక్టర్ జి.రామచంద్రారెడ్డి
హన్మకొండ: గోదావరి జలాలపై వరంగల్లోని నిట్ అధ్యయనం చేసిందని నిట్ ఇన్ చార్జి డైరెక్టర్ జి.రామ చంద్రారెడ్డి అన్నారు. నిట్ సివిల్ విభాగం ఎంతో సాంకేతిక నైపుణ్యం కలిగి ఉందని, దీనిని ఇప్పటి వరకు ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. కేంద్ర జలవనరుల మం త్రిత్వ శాఖ సలహాదారుడు, తెలంగాణకు చెందిన వెదిరె శ్రీరాం రచించిన ‘గోదావరి జలాల సమగ్ర వినియో గం–జాతీయ, తెలంగాణ రాష్ట్ర దృక్పథాలు’ పుస్తకంపై శనివారం వరంగల్లోని నిట్లో జరిగిన చర్చా కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు.
భూగర్భ జలాల పెంపున కు, నదుల్లో నీటి నిల్వలకు, నీటి ఎద్దడి నివారణకు వరంగల్ నిట్ విద్యార్థులు, అధ్యాపకులు అనేక పరిశో ధనలు చేశారని తెలిపారు. నీటిసాంద్రత పెంపుదల ప్రాజెక్ట్ రూపకల్పనకు నిట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం ఉపయెగిం చుకోవాలని కోరారు. వెదిరె శ్రీరాం రచించిన పుస్తకంలో పొందుపరిచిన అంశాలతో తెలం గాణ రాష్ట్రానికి నేషనల్ ప్రాజెక్ట్ హోదాను పొందే అవకాశంపై చర్చించారు.