g vinod
-
హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడి ఇంట్లో ఈడీ సోదాలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి జి వినోద్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. వినోద్‌తో పాటు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌ల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (TACB) దాఖలు చేసిన మూడు ఛార్జిషీట్ల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మంగళవారం వినోద్ సోదరుడు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి నివాసంలోనూ ఈడీ సోదాలు జరిపింది. వివేక్ కంపెనీ ఖాతాల్లో అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఫిర్యాదు నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. వివేక్, వినోద్ దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామి (కాకా) కుమారులు. -
అజహారుద్దీన్‌పై సీపీకి ఫిర్యాదు.. ‘తప్పుడు ధ్రువపత్రాలతో..’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో ఉప్పల్ వేదికగా సెప్టెంబర్ 25న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరిగిన నాటి నుంచి హెచ్‌సీఏపై వివిధ అంశాలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహారుద్దీన్ పదవీకాలానికి సంబంధించి మరో కేసు నమోదైంది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజహారుద్దీన్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 26తోనే ముగిసినప్పటికీ.. అతను తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించి చేసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని మాజీ అధ్యక్షుడు జి.వినోద్, సెక్రటరీ శేషు నారాయణ్, మెంబర్ చిట్టి శ్రీధర్ బాబు బృందం రాచకొండ సీపీ మహేష్ భగవత్‌కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు లిఖితపూర్వరంగా సీపీకి కంప్లైంట్‌ను అందజేశారు. పదవీకాలంపై ఎవరిని సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసుకున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 18న జరిగే బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్‌కు హాజరు అయ్యేందుకు అజహారుద్దీన్ తన పదవీకాలాన్ని పొడిగించుకున్నాడని ఆరోపించారు. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని సీపీకి కంప్లైంట్ చేశారు. -
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీమంత్రి వినోద్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ మంత్రి గడ్డం వినోద్ తిరిగి సొంతగూటికి చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఆయన శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా జి.వినోద్ పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం వినోద్ మాట్లాడుతూ..‘గతంలో కాంగ్రెస్ పార్టీని వీడడం అపరిపక్వ నిర్ణయం. తిరిగి సొంతగూటికి చేరడం సంతోషంగా ఉంది. ఇది నా అదృష్ఠంగా భావిస్తున్నాను. గతంలో కొన్ని పొరపాట్ల వలన పార్టీ మారాల్సి వచ్చింది. 35 ఏళ్ల నుంచి నాకు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. కాంగ్రెస్ మా సొంత పార్టీ. మా నాన్న వెంకటస్వామి ప్రోత్సహంతో రాజకీయాల్లోకి వచ్చాను. కొన్ని కారణాల వలన ఇండిపెండెట్‌గా పోటీ చేశాను. నా సోదరుడు వివేక్ బీజేపీలో చేరడం ఆయన వ్యక్తిగత విషయం. వివేక్ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. అందుకే నేను కాంగ్రెస్ లో చేరాను’ అని పేర్కొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో కాంగ్రెస్ నుంచి వినోద్, వివేక్ బ్రదర్స్ తొలుత 2013 జూన్ 2న టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత 2014 మార్చి 31న బ్రదర్స్ ఇద్దరూ తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వివేక్, చెన్నూరు అసెంబ్లీకి వినోద్ పోటీచేసి ఓడిపోయారు. అనంతరం రాజకీయ పునరేకీకరణ పేరుతో టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్‌లో 2016లో మరోసారి వీరిద్దరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వివేక్‌కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హోదా లభించింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికల్లో కూడా సోదరులిద్దరికీ టిక్కెట్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ మొండిచేయి చూపించింది. దీంతో వినోద్ ఒంటరిగా చెన్నూరు నుంచి పోటీ చేయగా.. వివేక్ ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీలో చేరారు. -
కాంగ్రెస్‌కు మరో షాక్!
కేసీఆర్‌తో గుత్తా, సురేశ్‌రెడ్డి, వివేక్, వినోద్ భేటీ టీఆర్ఎస్లో వారి చేరికకు సీఎం గ్రీన్‌సిగ్నల్ సాక్షి, హైదరాబాద్ అధికార టీఆర్ఎస్ పెద్ద ప్లాన్‌లోనే ఉంది! ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు మరో షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో.. ఆ పార్టీకే చెందిన మరో ముగ్గురు సీనియర్ నేతలు గులాబీ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ మంత్రి జి.వినోద్ గురువారం రాత్రి సీఎం కేసీఆర్‌తో మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు. టీఆర్ఎస్లో వీరి చేరికకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఎంపీ గుత్తా ఈ నెల 11న టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వీరంతా కలిసి ఒకేసారి గులాబీ తీర్థం పుచ్చుకుంటారా అన్న దానిపై స్పష్టత లేదు. అయినా ఈ వారంలోపే వీరంతా టీఆర్ఎస్లో చేరుతారని భావిస్తున్నారు. మాజీ ఎంపీ వివే క్ టీఆర్ఎస్లో చేరుతారని ఏడాది నుంచే ప్రచారంలో ఉంది. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఆయన టీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతుండడంతో ఈ నాయకులంతా బయటకు రావాలని నిర్ణయించుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.