గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు
బళ్లారి: కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా ఏడుగురి ఇళ్లపై ఆ రాష్ట్ర లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. శైలేంద్ర కుమార్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే బి.నాగేంద్ర, బీజేపీ శాసనసభ్యుడు సురేశ్‌బాబు, జనార్ధన్ రెడ్డి అనుచరుడు స్వస్తిక్ నాగరాజు ఇళ్లపై సోదాలు చేసినట్లు సిట్ అధికారి ఒకరు తెలిపారు. కంపలి, బళ్లారి, హోస్పేట్ తదితర ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్లు చెప్పారు.