gachibowli flyover
-
శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్.. 20 నిమిషాల్లో పంజాగుట్ట నుంచి ఓఆర్ఆర్కు
సాక్షి, గచ్చిబౌలి: శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి గచచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుకు రయ్.. రయ్‌మని వెళ్లవచ్చు. శిల్పా లేవుట్‌లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్‌తో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తక్కువ సమయం పడుతుంది. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను నెలకొల్పడంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లైఓవర్లతో వాహనదారులకు ఎంతో ఊరట లభిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎస్ఆర్డీపీ నిర్మించిన 17వ ఫ్లైఓవర్‌గా శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఏర్పాట్లు ఇలా.. ♦ మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ దిగగానే, ఐకియా వెనుక రోడ్డులో శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్‌కు చేరుకోవాలి. ♦ ఫ్లై ఓవర్ ఎక్కిన వాహనాలు ఓల్డ్ ముంబై జాతీయ రహదారిపై దిగొచ్చు. దిగువ ర్యాంప్ ద్వారా ఔటర్‌పై కూడా దిగవచ్చు. ♦ ఔటర్ నుంచి వచ్చే వాహనాలు ఎగువ ర్యాంప్ ద్వారా నేరుగా ఫ్లై ఓవర్ పైకి వెళతాయి. గచ్చిబౌలి జంక్షన్‌లోనూ ఫ్లై ఓవర్ పైకి వాహనాలు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేశారు. ♦ ఫ్లై ఓవర్ ముగియగానే, లెఫ్ట్ తీసుకొని డెలాయిట్ రోడ్డులో మైండ్ స్పేస్ ఫ్లైఓవర్‌పైకి చేరుకోవచ్చు. సాఫీగా ప్రయాణం.. సికింద్రాబాద్, కూకట్పల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల నుంచి వాహనాలు పంజాగుట్ట నాగార్జున సర్కిల్ నుంచి ప్రసాద్ ఐ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్ పోస్టు జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 45కు వెళతాయి. ♦ అక్కడ కేబుల్ బ్రిడ్జి నుంచి నేరుగా కోహినూర్ హోటల్ , మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ దిగిన వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. ఐకియా వెనుక నుంచి వెళ్లి రైట్ టర్న్ తీసుకుంటే శిల్ప లేఅవుట్లోని ఫ్లై ఓవర్ పై నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకోవచ్చు. ♦ జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనదారులు శంషాబాద్ విమానాశ్రయం, బెంగళూర్ జాతీయ రహదారితో పాటు నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, కోకాపేట్, శంకర్పల్లి, తెల్లాపూర్, కొల్లూరు, పటాన్చెరు వైపు వెళ్లవచ్చు. ♦ ఫ్లైఓవర్ నుంచి ఓల్డ్ ముంబయ్ జాతీయ రహదారికి దిగే వెసులుబాటు కల్పించారు. దీంతో రాయదుర్గం, మెహిదీపట్నం వైపు వెళ్లేందుకు వీలుంటుంది. ♦ శంషాబాద్ విమానాశ్రయం, పటాన్చెరు, కోకాపేట్, ఫ్లైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లింగంపల్లి, గచ్చిబౌలి నుంచి వాహనదారులు నేరుగా శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్ ద్వారా ఇట్టే జూబ్లీహిల్స్ చేరుకోవచ్చు. జంక్షన్లపై తగ్గనున్న ఒత్తిడి ♦ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలు గచి్చ»ౌలి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, మైండ్ స్పేస్ జంక్షన్‌కు వెళుతుంటాయి. లేదా గచి్చ»ౌలి జంక్షన్ నుంచి అంజయ్యనగర్‌లో రైట్ టర్న్ తీసుకొని రాంకీ రోడ్డులో వెళ్లి మైండ్ స్పేస్ ప్లై ఓవర్‌కు చేరుకునేవి. ♦ శిల్ప లేఅవుట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో అటు బయోడైవర్సిటీ, ఇటు అంజయ్యనగర్ వైపు వెళ్లాల్సిన పని లేదు. ♦ దీంతో గచ్చిబౌలి జంక్షన్లో వాహనాల తాకిడి తగ్గనుంది. అంతే కాకుండా బయోడైవర్సిటీ జంక్షన్‌లోనూ తగ్గే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ వ్యయం రూ.466 కోట్లు ►పొడవు 2,810 మీటర్లు (2.81 కిలోమీటర్లు) ►లైన్లు నాలుగు లేన్ల బై డైవర్షనల్ ఫ్లై ఓవర్ ►మెయిన్ ఫ్లైఓవర్ 956 మీటర్లు ►ఎగువ ర్యాంప్ 456.64 మీటర్లు ►దిగువ ర్యాంప్ 399.95 మీటర్లు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈ ప్రమాదం హైదరాబాద్‌లో జరిగిందా?
సాక్షి, హైదరాబాద్: నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు దాటుతుందంటారు. కానీ సోషల్ మీడియా పుణ్యాన ఊరేంటి, ఏకంగా ప్రపంచాన్నే చుట్టేస్తోంది. తాజాగా నెట్టింట మరో ఫేక్ వార్త హైదరాబాదీయులను ఆగమాగం చేసింది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌కు నిప్పంటుకుని పేలిందన్న వార్త తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ట్యాంకర్ ఆనవాళ్లు లేకుండా అగ్నికి ఆహుతవగా దాని పొగలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రమాదం నిజంగానే జరిగింది. కానీ భాగ్యనగరంలో కాదు. పుణెలో! (చదవండి: పాతిపెట్టిన పిల్లిని తీసి కూర వండేసింది!) ఓ నెల క్రితం పుణెలోని వార్జే బ్రిడ్జి మీద ఆహారపదార్థాలను మోసుకువెళ్తున్న సాధారణ ట్రక్కు నుంచి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న డ్రైవరు వాహనంలో నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. డిసెంబర్ 5న జరిగిన ఈ ఘటన తాజాగా హైదరాబాద్‌లో జరిగిందంటూ లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు సైతం దీనిపై స్పందించి ఇది మనదగ్గర జరగలేదని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు నగరంలో చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. అయినా సరే కొందరు ఈ ఫేక్ న్యూస్‌ను గుడ్డిగా నమ్మేస్తూ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి అసత్య వార్తలను విశ్వసించకండి, వాటిని ప్రోత్సహించకండి. (చదవండి: వ్యాక్సిన్‌తో జాంబీలుగా మారిపోతున్నారా?) ఒక్కమాటలో: సాధారణ ట్రక్కులో మంటలు చెలరేగిన ఘటన పుణెలో జరిగింది, హైదరాబాద్‌లో కాదు. This viral video is not of Gachibowli flyover. It is a FALSE news. It had happened on the Warje bridge, Pune a few days back. No such incidents have occurred in Hyderabad. Warning : Persons spreading rumours/misinformation leading to public fear will be dealt as per law. pic.twitter.com/ViOYlpxJDA — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) January 14, 2021 -
జయసుధ భర్తకు తప్పిన ప్రమాదం
సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ భర్త నితిన్ కుమార్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న స్విఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గుర్తించిన కపూర్ వెంటనే కారు దిగిపోవడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. మంటలో కారు పూర్తిగా తగలబడిపోయింది. కార్లలో మంటలు వ్యాపిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కారులో ఆదివారం రాత్రి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం సింగన్నగూడెం చౌరస్తావద్ద జాతీయ రహదారిపై రాత్రి 8.30గంటల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు షార్ట్‌సర్క్యూట్‌కు గురైంది. మంత్రితో పాటు ఆయన తమ్ముడు కృష్ణారెడ్డి, పీఏ నవీన్, డ్రైవర్ కృష్ణ, గన్మెన్లు ఎల్లయ్య, హరినారాయణ, రాంబాబు, సుబ్బారావులు కారులో ఉన్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్‌కు వెళ్తూ సింగన్నగూడెం వద్దకు రాగానే డ్యాష్‌బోర్డు నుంచి పొగలు రావడాన్ని గమనించారు. వెంటనే కారాపి అందరూ కిందికి దిగారు. డ్రైవర్ కారు బోయ్నెట్ను ఎత్తి వైర్లను సరిచేస్తుండగానే పెద్దఎత్తున మంటలు లేచాయి. డీజిల్ ట్యాంకు పగిలిపోయింది.