లెట్స్ ఎంజాయ్
ఉస్మానియా మెడికల్ కళాశాల లో విద్యార్థులు సందడి చేశారు. పుస్తకాలు, చదువులు, రాతలు అన్నీ పక్కన
పెట్టారు. సరదాగా కాసేపంటూ రంగులకేళిలో ఆకాశమే హద్దుగా ఎంజాయ్ చేశారు. పసందైన పాటలకు అదిరిపోయే స్టెప్పులతో మస్తీ మజా చేశారు. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ 2కే10 మ్యాథ్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బీట్స్-2014 విద్యార్థుల ఆటపాటలతో హుషారుగా సాగిపోయింది. బీట్స్ కేక్ కట్ చేసి స్నేహితులతో ఆనందాన్ని పంచుకున్నారు. ర్యాప్ స్టెప్స్‌తో ఉల్లాసంగా ఉత్సాహంగా గ డిపారు.
వారం రోజులు జరగనున్న ఈ ఈవెంట్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ విద్యార్థులకు రిలాక్సేషన్ కలిగిస్తాయని కార్యక్రమాన్ని ప్రారంభించిన డీ ఎంఈ డాక్టర్ పుట్టా శ్రీనివాసరావు అన్నారు. పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడానికి ఏటా ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమణి, డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.
- గజ్జెల వీరేశ్