బడ్జెట్ ధరలో శాంసంగ్ కొత్త ఫోన్
గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. బడ్జెట్ ఓరియెంటెంట్ గా 'గెలాక్సీ జే3 ప్రైమ్' పేరుతో దీన్ని అమెరికా మార్కెట్లో లాంచ్ చేసినట్టు కంపెనీ పేర్కొంది. దీని ధర 150 డాలర్లు అంటే దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు 9,600 రూపాయలు ఉండొచ్చు. ఈ కొత్త గెలాక్సీ జే3 ప్రైమ్, ఆండ్రాయిడ్ 7.0 నోగట్ తో రన్ అవుతుంది. బడ్జెట్ ధరల్లో లాంచ్ అవుతున్న జే సిరీస్ స్మార్ట్ ఫోన్లకు మార్కెట్లో భారీగా డిమాండ్ వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే
క్వాడ్ కోర్ 1.4గిగాహెడ్జ్ ఎక్సీనోస్ 7570ఎస్ఓసీ
1.5జీబీ ర్యామ్
16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
మైక్రో ఎస్డీ కార్డుతో 128జీబీ వరకు విస్తరణ మెమరీ
5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
2600 ఎంఏహెచ్ బ్యాటరీ