శామ్సంగ్ కొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: శామ్సంగ్ కంపెనీ గెలాక్సీ మోడల్లో మధ్య తరహా ఫోన్, గెలాక్సీ ఎస్ డ్యుయోస్ 2ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటరాక్టివ్ యూజర్ ఇంటర్ఫేస్, యాప్‌ల యాక్సెస్, కంటెంట్ 10 భారతీయ భాషల్లో యాక్సెస్ చేసుకునే వీలున్న ఈ ఫోన్ ధరను రూ.10,990గా కంపెనీ నిర్ణయించింది. తెలుగు, హిందీ, పంజాబీ, బెంగాలీ, తమిళం, కన్నడ, మలయాళం, అస్సామీ, మరాఠీ, గుజరాతీ భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
ఫేస్‌బుక్‌తో పాటు చాట్-ఆన్, జీమెయిల్, న్యూస్‌హంట్ తదితర యాప్‌లను ఈ 10 భారతీయ భాషల్లో యాక్సెస్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ డ్యూయల్ సిమ్ ఫోన్లో 4 అంగుళాల స్క్రీన్, 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 1.2 గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 768 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ మెమరీ, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 3జీ సపోర్ట్. 8 గంటల టాక్‌టైమ్ తదితర ప్రత్యేకతలున్నాయి. గెలాక్సీ సిరీస్‌లో రూ.4,900 నుంచి రూ.47,900 రేంజ్లో స్మార్ట్ఫోన్లను శామ్సంగ్ కంపెనీ అందిస్తోంది.