తప్పు ఒప్పుకున్న శాంసంగ్
కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ తప్పును ఒప్పుకుంది. తాము ప్రకటించినట్టుగా గెలాక్సీ సిరీస్ లో వస్తున్న ఎస్ 7 ఆక్టీవ్ ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదని, కొన్ని లోపాలున్నాయని అంగీకరించింది. తాము నిర్వహించిన పరీక్షల్లో గెలాక్సీ 7 యాక్టివ్ స్మార్ట్ ఫోన్లు విఫలమయ్యాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే దీన్ని సరిచేసే సామర్థ్యం తమ దగ్గరున్నట్టు తెలిపింది.
దీనికి సంబంధించి చాలా కొద్ది ఫిర్యాదులు తమకు అందాయని పేర్కొంది. వారంటీ పీరియడ్ లో ఉన్న ఫోన్లకు రిప్లేస్ మెంట్ చేస్తున్నట్టు ప్రకటించింది సీఎన్ఈటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించినపుడు టచ్ స్క్రీన్ పనిచేయలేదని, గ్రీన్ లైన్స్ వచ్చాయని, ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతోపాటు.. పవర్ బటన్ పనిచేయలేదు. కెమెరా లెన్స్ పై నీళ్లు తదితర సమస్యలు తలెత్తినట్టు శాంసంగ్ వివరించింది.
అయితే తాను రిలీస్ చేసిన అన్ని ఫోన్లలో లోపాలు లేవని, చాలా తక్కువ వాటిలో చాలా స్వల్పలోపాలు తలెత్తాయని చెబుతున్న శాంసంగ్ ఎన్ని యూనిట్లలో ఈ లోపాలున్నాయనేది స్పష్టం చేయలేదని ఎన్ గాడ్జెట్ రిపోర్ట్ చేసింది. కాగా ఎస్ 7 ఆక్టివ్ ఫోన్ నీటిలో కూడా పనిచేస్తుందనీ(వాటర్ రెసిస్టెంట్), ఐపీ68 సర్టిఫికేట్ ఉందనీ కంపెనీ ప్రచారం చేసుకుంది. అయితే కన్జ్యూమర్ రిపోర్ట్స్ అనే సంస్థ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్మార్ట్ ఫోన్ వాటర్ రెసిస్టెంట్ గా లేదని తేలింది. నీటిలో ఉంచినపుడు స్క్రీన్ పై గ్రీన్ షేడ్స్ కనిపించినట్లు, కెమెరాపై బుడగలను గుర్తించినట్టు ఇటీవల నివేదించిన సంగతి తెలిసిందే.