6న క్రీడా ఎంపిక పోటీలు
దేవరపల్లి : ఈ నెల 6న ఇంటర్ కళాశాలల జోనల్ మీట్, జిల్లా క్రీడా కారుల ఎంపిక పోటీలు స్థానిక అంబటి సత్యనారాయణరావు జిల్లా పరిషత్ హైస్కూలు క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు పీడీ కె.వి.డి.వి.ప్రసాద్ తెలిపారు. దేవరపల్లి బీహెచ్ఎస్సార్ వీఎల్ఎం డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో అండర్–19 పురుషులు, మహిళల ఫుడ్బాల్, మహిళా క్రికెట్, సపక్తక్రా పోటీలు నిర్వహించి జిల్లా క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. ఉదయం 8 గంటలకు క్రీడాకారులు ఒరిజినల్ పదో తరగతి మార్కుల జాబితా, స్టడీ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచిం చారు. వివరాలకు సెల్ : 9052127200లో సంప్రదించాలని కోరారు.