అమ్మా... గర్భిణుల విలాపం!
మరమ్మతుల కోసం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి ఖాళీ
మూడు రోజులుగా ప్రసవ వేదన..
గర్భిణులు వస్తే..ఇతర ఆస్పత్రులకు సిఫార్సు
పేట్లబురుజు, నిలోఫర్, గాంధీలోనూ చేదు అనుభవమే
అల్లాడుతున్న నిరుపేద మహిళలు
సిటీబ్యూరో పురిటి నొప్పులతో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చే నిరుపేద గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. నొప్పులు భరించలేక కళ్లముందే కుప్పకూలుతున్నా.. వైద్య సిబ్బంది కనికరించడం లేదు. సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ గోడలకు పగుళ్లు ఏర్పడటంతో నాలుగు రోజులుగా సిజేరియన్ ప్రసవాలు నిలిపేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను నిలోఫర్, గాంధీ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. అతికష్టం మీద ఆయా ఆస్పత్రులకు వెళ్లిన గర్భిణులకు తీరా అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురవుతోంది. పడకలు ఖాళీ లేక..తగినంత మంది వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఇక్కడ అడ్మిషన్ చేసుకోవడం లేదు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రరుుంచలేని నిరుపేదలు అల్లాడిపోతున్నారు. సరైన ప్రత్యామ్నాయం చూపకుండా..సుల్తాన్ బజార్ ఆస్పత్రిలో డెలివరీలు నిలిపివేయడం వల్లే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.
ప్రతిష్టాత్మక సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 300 మంది గర్భిణులు వస్తుండగా, 200 మందికిపైగా చికిత్స పొందుతుంటారు. రోజుకు సగటున 30 ప్రసవాలు జరుగుతుంటారుు. ఆపరేషన్ థియేటర్లోని గోడలకు ఇటీవల పగుళ్లు ఏర్పడ్డారుు. దీనికి తోడు వార్డుల్లోని గోడలకు బ్యాక్టీరియా, ఫంగస్ వ్యాపించింది. ఇది బాలింతలకు వ్యాపించే అవకాశం ఉండటంతో గత సోమవారం నుంచి ఆపరేషన్ థియేటర్‌ను మూసేసి మరమ్మతులు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ అడ్మిటైన గర్భిణులను, బాలింతలను ఖాళీ చేరుుంచారు. తాజాగా వస్తున్న రోగులను పేట్లబురుజు, గాంధీ, నిలోఫర్, కింగ్‌కోఠి ప్రసూతి ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. అంబులెన్స కూడా లేక పోవడంతో ఎవరికి వారే ఆటోల్లో వెళ్లిపోతున్నారు.
నిరాకరించిన పేట్లబురుజు...
ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చిన గర్భిణులను చేర్చుకుని చికిత్స అందించేందుకు పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే ఆ ఆస్పత్రిలో వైద్యుల నిష్పత్తికి మించి గర్భిణుల సంఖ్య ఉండటంతో...కొత్తగా ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చిన గర్భిణులకు తాము ప్రసవాలు చేయలేమని ఆ ఆస్పత్రి వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో వారిని గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులకు పంపుతున్నారు. అనేక వ్యయప్రయాసలకోర్చి ఆయా ఆస్పత్రులకు చేరుకున్న గర్భిణులకు తీరా అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురవుతోంది. ఆయా ఆస్పత్రుల్లో పడకలు ఖాళీ లేక పోవడం, ఉన్నవాటిపై ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు సర్దుకుంటుండటంతో చేసేది లేక వచ్చిన వారిని తిప్పి పంపుతున్నారు. నొప్పులు మొదలైన తర్వాత రావాల్సిందిగా సూచిస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన గర్భిణులు మళ్లీ వచ్చే ఓపిక లేక ఆర్థికంగా భారమైనా తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రరుుస్తున్నారు.
చేరుు తడపాల్సిందే..
ఇదిలా ఉంటే ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో పుట్టిన ప్రతి బిడ్డకూ సిబ్బంది ధర నిర్ణరుుస్తున్నారు. తల్లిదండ్రులు తమ కన్నబిడ్డను కళ్లారా చూసుకోవాలంటే అడిగినంత (ఆడబిడ్డ పుడితే రూ.800, మగబిడ్డ పుడితే రూ.1500) ఇవ్వాల్సిందే. లేదంటే చీదరింపులు, చీత్కారాలే. దీంతో పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం చేరుుంచు కోవచ్చని భావించి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చిన పేదలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కీలకమైన విభాగాల్లో రెగ్యులర్ స్టాఫ్‌ను నియమించాల్సి ఉన్నా..కొంత మంది అధికారులు కాంట్రాక్ట్ సిబ్బందితో కుమ్మకై ్క అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.