వాట్సప్ మెసేజ్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్
ఎల్బీనగర్: బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ గాంధీ చిల్డ్రన్స్ పార్కులో చెత్త పేరుకుపోయి అధ్వానంగా ఉండటంతో స్థానికులు వాట్సప్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు సమస్యను చేరవేశారు. వెంటనే స్పందించిన మంత్రి.. చెత్తను తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం ఎల్బీనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పంకజ పార్కు వద్దకు చేరుకుని సిబ్బందితో చెత్తను తొలగించారు.