చెరుకు రైతుకు తీపి కబురు
పెద్దేముల్: మెదక్ జిల్లా సంగారెడ్డిలోని గణేష్ చెరుకు ఫ్యాక్టరీ గురువారం నుంచి ప్రారంభం కానుందని పెద్దేము ల్, బంట్వారం ఏరియా మేనేజర్ రాఘవేందర్ పేర్కొన్నారు. పెద్దేముల్ మం డల కేంద్రంలో మంగళవారం చెరుకు రైతులతో ఆయన మట్లాడారు. రైతులకు సకాలంలో లారీల కొరత లేకుం డా చూస్తానన్నారు. పెద్దేముల్, బం ట్వారం మండలాల్లో ఈ యేడాది 64 వేల టన్నుల చెరుకు కొనేందుకు ప్రణాళిక తయారు చేశామన్నారు. బంట్వా రం మండలంలో 1,026, పెద్దేముల్లో 2,107 టన్నుల చెరుకు ఇప్పటివరకు రైతుల నుంచి అగ్రిమెంట్ చేసుకున్నామన్నారు. ఈ యేటా టన్నుకు రూ.2600 చెల్లిస్తామన్నారు.
రోడ్డు మరమ్మతు చేయాలి..
రైతులు చెరుకు పంటను అమ్ముకునే ందుకు సంగారెడ్డి వెళ్లాల్సి వస్తోంది. పెద్దేముల్-సంగారెడ్డి రోడ్డు అధ్వానంగా మారడంతో రవాణాకు ఇబ్బం దిగా ఉంది. పండించిన చెరుకు అమ్ముకునేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దళారులను ఆశ్రయిం చాల్సి వస్తోందన్నారు. పెట్టుబడులు వచ్చే పరిస్థితి కూడా లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సంగారెడ్డి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఎరువులు అందుబాటులో ఉంచాలి..
సంగారెడ్డి గణేష్ ప్యాక్టరీ యజమాన్యం రైతులకు అందజేస్తున్న ఎరువులను మండల కేంద్రంలో అందుబాటులో ఉంచాలని పెద్దేముల్ గ్రామ రైతులు కొరుతున్నారు. ప్రతియేటా ఎరువులు అందచేస్తున్న సమయానికి అందచేయ టం లేదని, మండల కేంద్రంలో ఎరువులు అందజేయాలని కోరుతున్నారు.